Adivi Sesh: ‘నావల్ల కావట్లేదు.. నాకు బ్రేక్ కావాలి’.. హిట్ 2 మేకర్స్‌కు అడవి శేష్ రెక్వెస్ట్

హృదయాన్ని కదిలించే.. మనసుకు హత్తుకునే స్టోరీ ఏదైనా తమ దగ్గరికి వస్తే.. రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడతారు చాలా మంది హీరోలు.

Adivi Sesh: 'నావల్ల  కావట్లేదు.. నాకు బ్రేక్ కావాలి'.. హిట్ 2 మేకర్స్‌కు అడవి శేష్ రెక్వెస్ట్
Adavi Shesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 23, 2022 | 8:35 PM

హృదయాన్ని కదిలించే.. మనసుకు హత్తుకునే స్టోరీ ఏదైనా తమ దగ్గరికి వస్తే.. రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడతారు చాలా మంది హీరోలు. డైరెక్టర్ తో ప్రయాణిస్తూ.. ఆయన ఊహల్లోకి తొంగిచూస్తూ.. ఆయన ఆలోచనలతో అల్లుకుపోతూ.. వారికి నచ్చేట్టుగా.. నటనను ఇచ్చేస్తుంటారు. అటు శారీరకంగా.. ఇటు మానసికంగా ఇష్టంతో కష్టపడతుంటారు. అయితే ఇటీవల అడవి శేష్(Adivi Sesh) కూడా ‘మేజర్’ సినిమా విషయంలో ఇదే చేశారు. ఉగ్రమూకల నుంచి ఎంతో మంది ప్రాణాలను కాపాడి.. వీరత్వం పొందిన వీరుని కథలో మనకు కనిపించారు. మేజర్ ఉన్ని కృష్ణన్‌గా పాన్ ఇండియన్ రేంజ్‌లో అలరించారు. ఇక ఇప్పుడు హీరో నానికి నాకు కాస్త బ్రేక్‌ కావాలంటూ.. ఓ అర్జీ పెట్టుకున్నారు. బహిరంగ లేఖను విడుదల చేశారు.

దీని గురించి అడివి శేష్‌ మాట్లాడుతూ ”మేజర్‌ రిలీజ్‌ కాగానే హిట్‌2 షూటింగ్‌లో పాల్గొనాలి. ఆఖరి షెడ్యూల్‌ని పూర్తి చేయాలి. కానీ మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్‌ ని ప్రపంచంలోని నలుమూలలా ఉన్న ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాను. శారీరకంగా, మానసికంగా అత్యంత సంతృప్తినిచ్చిన క్షణాలు ఆస్వాదించాను. ఆ విషయాలను నానికి,  శైలేష్‌కి వివరించాను. ఫైనల్‌ షెడ్యూల్‌ని అతి త్వరలోనే పూర్తి చేస్తానని చెప్పాను. వాళ్లు నన్ను అర్థం చేసుకున్నారు. చివరి షెడ్యూల్‌ పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు మొదలుపెడతాం. హిట్‌2 రిలీజ్‌ గురించి అతి త్వరలోనే గ్రాండ్‌గా అనౌన్స్ చేస్తాం” అని అన్నారు. సెకండ్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌, హిట్‌2లో అడివి శేష్‌ కృష్ణదేవ్‌ అనే కేరక్టర్‌ చేస్తున్నారు. అందరూ కృష్ణదేవ్‌ని కేడీ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కథగా చూపిస్తారు. సెకండ్‌ పార్ట్ ఆఫ్‌ హిట్‌ (హొమిసైడ్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌)ని ప్రముఖ స్టైలిస్ట్ ప్రశాంతి త్రిపిరనేని నిర్మిస్తున్నారు. నాని సమర్పిస్తున్నారు. వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై రూపొందిస్తున్నారు. Dr. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?