Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: ‘చిరంజీవికి జీవితాంతం రుణపడి ఉంటాం’.. ఊర్వశి రౌతెలా ఎమోషనల్.. అసలు ఏం జరిగిందంటే?

మెగాస్టార్ చిరంజీవి దాన గుణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆపన్న హస్తం అందిస్తారాయాన. అందుకే మెగాస్టార్ కు కోట్లాది మంది అభిమానులున్నారు. తాజాగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఊర్వశి రౌతెలా చిరంజీవి గొప్ప తనం గురించి ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టింది.

Chiranjeevi: 'చిరంజీవికి జీవితాంతం రుణపడి ఉంటాం'.. ఊర్వశి రౌతెలా ఎమోషనల్.. అసలు ఏం జరిగిందంటే?
Urvashi Rautela, Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Feb 14, 2025 | 4:19 PM

మెగాస్టార్ చిరంజీవి ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయ పడ్డారు. సామాన్యులు, అభిమానులు, సినీ నటులు, జర్నలిస్టులు, కార్మికులు.. ఇలా కష్టాల్లో ఉన్న తన వంతు ఆపన్న హస్తం అందించారు. అయితే చాలా వరకు తాను చేసిన గొప్ప పనులను చిరంజీవి బయటకు చెప్పుకోరు. అయితే చిరంజీవి ద్వారా సాయమందుకున్న వారిలో కొందరు అప్పుడప్పుడు ఈ విషయాలను అందరితో పంచుకుంటారు. అలా తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా చిరంజీవి తనకు ఏ విధంగా సాయం చేశారో చెప్పుకొచ్చింది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది ఊర్వశి రౌతెలా. ‘బాసూ వేర్ ఈజ్ ద పార్టీ’ అంటూ చిరంజీవితో సరదాగా స్టెప్పులేసింది. సినిమాల సంగతి పక్కన పెడితే కష్ట సమయాల్లో తనకు, తన కుటుంబానికి చిరంజీవి అండగా నిలిచారంటోంది ఊర్వశి. ఇటీవల ఆమె తల్లి మీను రౌతేలా తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఎడమ కాలిలో ఇంట్రా – ఆర్టిక్యులర్ ఫ్రాక్చర్‌తో ఆస్పత్రిలో చేర్పించారు. ఇదెంతో ప్రమాదకరమని డాక్టర్లు చెప్పగా ఊర్వశి.. చిరంజీవిని సంప్రదించి సహాయం కోరిందట. వెంటనే స్పందించిన మెగాస్టార్.. కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో డాక్టర్ల బృందంతో మాట్లాడి మీనూ రౌతెలాకు మెరుగైన వైద్యం అందేలా చేశారట. సర్జరీ అనంతరం ఊర్వశి తల్లి సమస్య నుంచి పూర్తిగా కోలుకున్నారట. ఇప్పుడు ఇదే విషయాన్ని ఊర్వశి అందరితో పంచుకుంది.

ఒక్క మాట అడగ్గానే.. సాయం చేశారు

‘చిరంజీవి గారి సేవా కార్యక్రమాల గురించి చాలా విన్నాను. వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్‌లో ఆపదలో ఉన్న వారికి నేను చూస్తుండగానే ఎంతో మందికి సాయం అందించారు. ఆ సాయం నా వరకూ వచ్చింది. అమ్మ కాలి ఎముకకు పెద్ద సమస్య వచ్చింది. మొహమాటంగానే చిరంజీవి గారి సాయం కోరాను. వెంటనే స్పందించిన ఆయన కోల్‌కతాలోని డాక్టర్లతో మాట్లాడి అమ్మకు సర్జరీ చేయించారు. అనంతరం మీ అమ్మ బాగానే ఉన్నారు, ఆమె ఆరోగ్యంగా ఉంటారని ధైర్యం చెప్పారు. ఆయన చెప్పిన మాటలు నాకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ అండగా నిలిచారు. ఏ అవసరం వచ్చినా అడగడానికి మొహమాటపడొద్దన్నారు. భూమ్మీద ఇంకా మంచితనం, మానవత్వం బతికే ఉందని చిరంజీవి గారు నిరూపించారు. మా కుటుంబం ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటుంది. ఆయన్ను దేవుడిగా, మా శక్తికి లైట్‌హౌస్‌గా భావిస్తాను’ అని ఊర్వశి ఎమోషనలైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.