AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Vinitha : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన వెంకటేష్ హీరోయిన్.. రీ ఎంట్రీకి సిద్ధంగా ఉందట..

విక్టరీ వెంకటేష్ కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల్లో ఒక సినిమా 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు'...

Actress Vinitha : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన వెంకటేష్ హీరోయిన్.. రీ ఎంట్రీకి సిద్ధంగా ఉందట..
Rajeev Rayala
| Edited By: Ram Naramaneni|

Updated on: Feb 06, 2021 | 12:15 PM

Share

Actress Vinitha : విక్టరీ వెంకటేష్ కెరియర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల్లో ఒక సినిమా ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’. ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లో ఒక మైలు స్టోన్ గా నిలిచిపోయింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే భర్తగా నటించి ఆకట్టుకున్నారు. ఇక బ్రహ్మానందం, కోటశ్రీనివాస్ రావుతో కలిసి ఆయన పండించిన కామెడీ అందరిని కడుపుబ్బా నవ్వించింది.

ఈ సినిమా హీరోయిన్ గా అందాల తార సౌందర్య నటించారు. మరో హీరోయిన్ గా నేపాలీ అమ్మాయి పాత్రలో వినీత నటించింది. అందంతో పాటు అభినయంతో కూడా ఆకట్టుకున్న వినీత టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించలేక పోయింది. తెలుగులో వినీత ఎక్కువ సినిమాలు చేయకపోయినా ఇతర భాషల్లో చాలా సినిమాలే చేసింది. మొత్తంగా ఈ హీరోయిన్ 70 సినిమాలవరకు నటించింది. ఆతర్వాత ఆమె పెద్దగా కనిపించలేదు. చాలా కాలాంతర్వత ఇటీవల ఆమె ఓ కార్యక్రమంలో మీడియా కంటపడ్డారు. ఎవ్వరు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు వినీత. ఈసందర్భంగా తిరిగి సినిమాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు జవాబు ఇస్తూ మంచి పాత్రలు దక్కితే తప్పకుండా చేస్తా అని అన్నారు వినీత.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmi Gautam : ప్రేమికులకు సలహా ఇచ్చిన జబర్ధస్ యాంకర్.. వ్యాలెంటైన్స్ డే అలా చేయొద్దంట..