Malavika Mohanan: మాళవిక మోహనన్‌పై ఫన్నీ మీమ్స్.. విచిత్రంగా తానే షేర్ చేసి.. బెస్ట్ ఏదో కూడా చెప్పేసింది
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలను ట్రోల్ చేయటం బాగా ఎక్కువైంది. ముఖ్యంగా సెలబ్రిటీల మీమ్స్‌ను విపరీతంగా వైరల్ చేస్తున్నారు నెటిజెన్లు.
Malavika Mohanan: ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలను ట్రోల్ చేయటం బాగా ఎక్కువైంది. ముఖ్యంగా సెలబ్రిటీల మీమ్స్‌ను విపరీతంగా వైరల్ చేస్తున్నారు నెటిజెన్లు. ఈ ట్రోలింగ్‌తో చాలా మంది స్టార్స్ హర్ట్ అవుతున్నారు కూడా. కానీ… మాళవిక మోహనన్ మాత్రం నేను సమ్‌థింగ్ స్పెషల్ అంటున్నారు. తన మీద వచ్చిన మీమ్స్‌ను తానే ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు వాటిలో బెస్ట్ ఏదో కూడా చెప్పారు మాళవిక.
‘మాస్టర్’ సినిమాలో ఓ సీరియస్ సీన్‌లో మాళవిక ఎక్స్‌ప్రెషన్స్‌తో మీమ్స్ చేశారు ట్రోలర్స్. ఆమె బ్రెష్ చేస్తున్నట్టు, మిల్క్ ప్యాకెట్ కట్ చేస్తున్నట్టు, బీర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేస్తున్నట్టుగా ఇలా రకాలుగా మీమ్స్ చేశారు. వీటిని తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన మాళవిక… ‘ఈ మీమ్స్ చూసి నవ్వలేక చచ్చిపోయా… ముఖ్యంగా టూత్ పేస్ట్ మీమ్ అయితే సూపర్’ అంటూ కామెంట్ చేశారు.
మాళవిక మోహనన్ సోషల్ మీడియా పేజ్‌లకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను ఊరిస్తుంటారు మాళవిక. అందుకే ఈ బ్యూటీ సోషల్ మీడియా పోస్ట్‌లు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. తాజాగా మాళవిక షేర్ చేసిన మీమ్స్ కూడా ఇప్పుడు అదే రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.
I’m a little late to my own meme-fest, but this is hilarious guys? Sharing some of my personal favourites which cracked me up(I died laughing seeing the toothpaste one)? Life is too boring if you can’t laugh at yourself, right? ? pic.twitter.com/UAABIUdBZ0
— malavika mohanan (@MalavikaM_) February 3, 2021