‘A’ Movie Trailer: ‘పారసెట్‌మాల్‌ను కనిపెట్టడానికి ఎంత మంది చనిపోయారో తెలుసా.?’ ఉత్కంఠ రేపుతోన్న ‘A’ ట్రైలర్..
'A' Movie Trailer Out: ఉత్కంఠ రేపే కథనం, ఆశ్చర్యాన్ని కలిగించే కథ.. ఇప్పడు ఇలాంటి అంశాలతో తెలుగులో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలకు బ్రహ్మ రథం పడుతుతండడంతో దర్శకనిర్మాతలు కూడా..
‘A’ Movie Trailer Out: ఉత్కంఠ రేపే కథనం, ఆశ్చర్యాన్ని కలిగించే కథ.. ఇప్పడు ఇలాంటి అంశాలతో తెలుగులో సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలకు బ్రహ్మ రథం పడుతుతండడంతో దర్శకనిర్మాతలు కూడా ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ కథాంశంతోనే తెలుగుతో పాటు పలు భాషల్లో ‘A’ అనే సినిమా తెరకెక్కుతోంది. నూతన నటీనటులు నితిన్ ప్రసన్న, ప్రీతి జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎంతో ఆసక్తికరమైన కథనంతో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో వచ్చే.. ‘నీకొక విషయం తెలుసా! ఇప్పుడు జ్వరం వస్తే వేసుకోడానికి పారాసెటమాల్ ఉంది. అయితే, దాన్ని కనిపెట్టడానికి ఎంతమంది చనిపోయారో తెలుసా? సైన్స్ త్యాగాన్ని కోరుకుంటుంది’ అనే డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో హీరోకు ఒకే కల పదే పదే వస్తుంటుంది. ఆ కల వల్ల హీరో జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. అసలు అతనికి వచ్చే కల ఏంటి..? దాని వెనక ఉన్న రహస్యమేంటి అన్న ఆసక్తికర కథనంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా మార్చి 5న పీవీఆర్ పిక్చర్స్ విడుదల చేస్తోంది. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌పై మీరూ ఓ లుక్కేయండి..