సోషల్ మీడియాలో అత్యధికంగా సంపాదిస్తున్న స్టార్స్ ఎవరో తెలుసా.. టాప్ 5లో నిలిచిన ఇండియన్ సెలబ్రెటీస్..
ప్రస్తుతం కాలంలో సోషల్ మీడియా హవా నడిస్తోంది. దాదాపు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉంటున్నారు. ఏం చేసినా అందుకు సంబంధించిన ప్రతి విషయాన్ని నెట్టింట్లో పోస్ట్
ప్రస్తుతం కాలంలో సోషల్ మీడియా హవా నడిస్తోంది. దాదాపు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉంటున్నారు. ఏం చేసినా అందుకు సంబంధించిన ప్రతి విషయాన్ని నెట్టింట్లో పోస్ట్ చేయాల్సిందే. ఇక ప్రస్తుతం చిన్న పిల్లలు సైతం సోషల్ మీడియాను ఏలేస్తున్నారు. ఇక సెలబ్రెటీలు కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉంటూ తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంటారు. ఇక హీరోహీరోయిన్లు పెట్టే ప్రతి చిన్న ఫోటోకు లైక్స్, షేర్స్ మాములుగా ఉండవు. ఇక సోషల్ మీడియాలో చేసిన పోస్టులతో అత్యధికంగా సంపాదిస్తున్నవారిలో టాప్ 5 ఇండియన్ సెలబ్రెటీలు వీరే.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అత్యధిక పారితోషికం తీసుకుంటూ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అటు బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రియాంక..ఒక్కో బ్రాండ్ ప్రమోషన్ పై ఒక్క పోస్టుకు రూ.1.80 కోట్ల వరకు తీసుకుంటుంది. అత్యంత ధనువంతులైన ఇన్‌స్టాగ్రామర్‌గా ఫోర్బ్స్ ఇండియా తెలిపింది. అలాగే ఈ తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. తన ఇన్స్టాగ్రామ్లో దాదాపు 94.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కోహ్లీ ఒక్క పోస్టుకు దాదాపు రూ.135 కోట్ల పీజు వసూలు చేస్తున్నాడు. వీరిద్దరి తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ మూడవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్లో 42 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక అలియా ఒక్క పోస్టుకు సుమారు రూ. 1 కోటి వరకు తీసుకుంటుంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో షారుఖ్ ఖాన్ ఒకరు. ప్రస్తుతం షారుఖ్ ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య 24.1 మిలియన్స్. సోషల్ మీడియాలో షారుఖ్ ఒక్క పోస్ట్ చేయడానికి దాదాపు రూ.80 లక్షల వరుక తీసుకుంటూ నాల్గవ స్థానంలో నిలిచాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ప్రస్తుత సెలబ్రెటీలతోపాటు పోటీలో నిలిచాడు. ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండే అమితాబ్ ఇన్ స్టా ఫాలోవర్స్ దాదాపు 24.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా వెల్లడైనా రిపోర్టుల ప్రకారం అమితాబ్ ఒక్క పోస్టుకు రూ.40 నుంచి రూ.50 లక్షల వరుకు వసూలు చేస్తూ టాప్ 5లో చోటు సంపాదించారు.
Also Read: