సుమక్కకు పోటీగా దిగిన వంటలక్క.. వాటికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ప్రేమి విశ్వనాథ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..
వంటలక్కకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బుల్లితెరపై తన నటనతో హీరోయిన్లతో పోటీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది ప్రేమి విశ్వానాథ్.
వంటలక్కకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బుల్లితెరపై తన నటనతో హీరోయిన్లతో పోటీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది ప్రేమి విశ్వానాథ్. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ పరంగానే కాకుండా.. ప్రస్తుతం తెలుగులోనే టాప్ సీరియల్‌గా బ్రేకులు లేకుండా దూసుకుపోతుంది ‘కార్తీక దీపం’. ఆ సీరియల్‌కు అంత క్రేజ్ వచ్చింది అంటే ఓ రకంగా వంటలక్క వల్లే అనుకోవచ్చు. తాజాగా ఈ వంటలక్క మన యాంకర్ సుమకు పోటిగా దిగింది.
తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లు యాడ్‌లో సుమకు పోటీగా దిగింది. తాజాగా ఓ వీటికి సంబంధించిన యాడ్‌లో వీరిద్దరు నటించారు. అందులో వంటలక్క దోశలు వేస్తూ కనిపించింది. అయితే దీనికి సంబంధించిన ఫోటోలను వంటలక్క తన సోషల్ మీడియలో షేర్ చేస్తూ.. “సుమక్కతో కలిసి ఈ యాడ్ చేయడం చాలా సంతోషంగా ఉంది” అంటూ తన సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసింది.అందులో వంటలక్క దోశలు వేస్తున్న ఫోటోలను కూడా షేర్ చేసింది. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అక్కడ సీరియల్లో వంటలు చేయడమే.. ఇక్కడ యాడ్‌లో వంటలు చేయడమేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:
భారీ మల్టీస్టారర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఎన్టీఆర్ భామ.. షూటింగ్‌లోకి స్వాగతం పలికిన చిత్రయూనిట్..