
ఒకప్పుడు సినీరంగంలో ఆమె టాప్ హీరోయిన్. తెలుగు, హిందీ, తమిళం భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. కానీ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా తన ఇంట్లోనే తనను వేధిస్తున్నారంటూ వీడియో రిలీజ్ చేసింది. ఆమె మరెవరో కాదు.. తను శ్రీ దత్తా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తనుశ్రీ దత్తా వార్తల్లో నిలిచింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చాలా ఆవేదనతో సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన ఇంట్లోనే తనని వేధిస్తున్నారని.. ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. తన ఇంట్లోనే తనకు భద్రత లేకుండా పోయింది. రేపో, ఎల్లుండో పోలీసుల దగ్గరకు వెళ్తాను అని చెప్పింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ ఏడుస్తూ తనుశ్రీ వీడియో పోస్ట్ చేసింది.
అయితే 2018లో మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటుడు నానా పటేకర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనని లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది. ఈ కేసులో పటేకర్‌కి క్లీన్ చిట్ దక్కింది. ఇప్పుడు మాత్రం తన ఇంట్లోనే తనకు వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి: Damarukam movie: ఢమరుకం మూవీ విలన్ గుర్తున్నాడా.. ? అతడి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్..
Shopping Mall : షాపింగ్ మాల్ సినిమాలో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఇప్పుడేం చేస్తుందంటే..
తనుశ్రీ దత్తా.. నార్త్ ఆడియెన్స్ కు పరిచయం అవసరం లేని హీరోయిన్.. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. కానీ ఆషిక్ బనాయా అప్నే పాటతో ఈమెకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ 2005లో ‘వీరభద్ర’ అనే మూవీ చేసింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాలు నటించిన ఆమె తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.
Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..