Tollywood: అబ్దుల్​ కలాంతో​ ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్.. ముట్టుకుంటే మాసిపోతుందా అనేంత అందం..

పైన ఫోటోలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా? ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగులో యంగ్ హీరోల సరసన ఆడిపాడింది. ప్రజంట్ మంచి కమ్ బ్యాక్ సినిమా కోసం వెయిట్ చేస్తుంది. తనెవరో మీరు కనిపెట్టగలరా..?

Tollywood: అబ్దుల్​ కలాంతో​ ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు హీరోయిన్.. ముట్టుకుంటే మాసిపోతుందా అనేంత అందం..
Heroine Childhood Photo
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 23, 2023 | 6:50 PM

ప్రజంట్ త్రో బ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే హీరో హీరోయిన్స్ ఇతర ప్రముఖల చిన్ననాటి ఫోటోలు వైరల్ చేస్తున్నారు వారి అభిమానలు. అలాంటి ఓ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ ఫోటోల మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారితో మాట్లాడుతున్న అమ్మాయిని గుర్తుపట్టారా..? తను ఉత్తరాది అమ్మాయి అయినప్పటికీ.. మన వద్ద కొన్ని మంచి సినిమాల్లో నటించింది. సందీప్ కిషన్, నేచురల్ స్టార్ నాని, శర్వా వంటి హీరోలతో ఆడిపాడింది. తమన్నా ముందు ఇండస్ట్రీకి వచ్చింది కానీ లేదంటే ఈమెనే.. మిల్కీ బ్యూటీ అనేవారు. అలా పాలరాతి శిల్పంలా మెరిసిపోతుంది తను. ఇప్పటికైనా గుర్తుపట్టారా..? లేదా అయితే మేమే చెప్పేస్తాం లెండి.

తను సురభి. తెలుగులో బీరువా చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాతి కాలంలో ఎక్స్‌ప్రెస్ రాజా, అటాక్, జెంటిల్‌మెన్, ఒక్క క్షణం, ఓటర్, శశి వంటి చిత్రాల్లో కనిపించింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ కనిపించలేదు. చివరిగా 2021లో కన్నడ  మూవీ సకత్‌లో మెరిసింది. ఆ తర్వాత సినిమాలు చేసిన దాఖలాలు లేవు. కొత్త ప్రాజెక్ట్స్ గురించి అప్ డేట్స్ కూడా లేవు.

వెండితెరకు దూరంగా ఉన్న సురభి.. సోషల్ మీడియాలో యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ముట్టుకుంటే మాసిపోతుందా అన్న అందంతో కుర్రాళ్ల హృదయాలను కట్టి పడేస్తుంది ఈ బ్యూటీ. ఆ ఫోటోలు ఇన్ స్టాలో చూసిన ఫ్యాన్స్.. మరో కొత్త ప్రాజెక్ట్‌తో వచ్చేయండి మేడమ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రజంట్ సురభి చిన్నప్పటి పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.