Tollywood : అప్పట్లో కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జునతో బ్లాక్ బస్టర్.. తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్..
ఒకప్పుడు తెలుగులో ఆమె తోపు హీరోయిన్. అందం, అభియంతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ముద్దుగుమ్మ. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. ఇప్పుడు తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన నటి, ‘మురారి’ బ్యూటీ సోనాలి బింద్రే సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు తన సహజమైన నటనతో, అద్భుతమైన అందంతో తెలుగు సినీ ప్రేమికుల మనసు గెలుచుకున్న ఆమె, తాజాగా ఒక ప్రతిష్టాత్మక చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. తెలుగులో సోనాలి బింద్రే నటించిన ‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మధుడు’ వంటి చిత్రాలు తెలుగులో క్లాసిక్ హిట్లుగా నిలిచాయి. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఆమె టాలీవుడ్‌కు దూరమయ్యారు. అయితే, ప్రస్తుతం ఆమె మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమపై దృష్టి సారించారనే వార్త సినీ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. ప్రముఖ దర్శకులు లేదా పెద్ద బ్యానర్లు ఆమెతో చర్చలు జరుపుతున్నారని, ఒక పవర్‌ఫుల్ పాత్ర కోసం ఆమెను సంప్రదించారని తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో సోనాలి అభిమానులు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం..
క్యాన్సర్ పోరాటం :
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఆమె.. ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నారు. కానీ క్యాన్సర్ ఆమెను కదిలించింది. 2018లో సోనాలి బింద్రే స్టేజ్-4 క్యాన్సర్ బారిన పడ్డారు. ప్రాణాపాయ స్థితి నుంచి ఆమె ఎంతో ధైర్యంతో పోరాడి, విజయం సాధించడం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆ కఠిన పరిస్థితుల నుంచి కోలుకున్న తర్వాత, ఆమె మళ్ళీ తన కెరీర్‌ను మళ్లీ ప్రారంభించారు. వెబ్ సిరీస్‌లైన ‘ది బ్రోకెన్ న్యూస్’, తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘రాఖ్’ (Raakh) లలో తల్లిగా ఆమె పోషించిన పాత్రలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..
మంచి పాత్రల కోసం వెయిటింగ్:
క్యాన్సర్ తర్వాత సోనాలి పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. తనను తాను మానసికంగా ఉత్సాహంగా ఉంచుకునే పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె మళ్ళీ టాలీవుడ్‌లో అడుగుపెడితే, అది ఖచ్చితంగా ఆమె కెరీర్‌కు మరో కీలక మలుపు అవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా అలరించిన సోనాలి, ఇప్పుడు తన నటనతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె హిందీలో బుల్లితెరపై పలు షోలలో కనిపిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..
సోనాలి బింద్రే..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..
