సెకండ్ ఇన్నింగ్స్ లో స్పీడ్ పెంచిన కాజల్ అగర్వాల్ 

20 June 2026

Pic credit - Instagram

Rajeev 

2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది చందమామ కాజల్ అగర్వాల్. 

ఈ అందాల భామ 2009లో రామ్ చరణ్ సరసన రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రం బ్లాక్ బస్టర్ అందుకుంది.

దాంతో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది.  ఆతర్వాత వరుసగా సినిమా ఛాన్స్ లు అందుకుంది. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతోనూ నటించింది. 

అదే సంవత్సరం హీరో రామ్ పోతినేనితో కలిసి గణేష్,అల్లు అర్జున్ తో ఆర్య-2 లో నటించింది. అలాగే ప్రభాస్ డార్లింగ్ లో హీరోయిన్ గా మెప్పించింది.

ఇక ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ, ఇలా తెలుగు హీరోలతో పాటు కార్తీ, విజయ్, సూర్య లాంటి తమిళ్ స్టార్స్ తో కూడా నటించింది. 

పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది . చాలా కాలం తర్వాత ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి తిరిగి బిజీ అవుతుంది. 

ప్రస్తుతం బాలకృష్ణ సరసన ఓ సినిమా అలాగే లేడీ ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.