AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Vamsi : ఆహుతి ప్రసాద్ నాకు క్లోజ్.. కానీ చివరి చూపు కోసం అందుకే వెళ్లలేదు.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. కమర్షియల్ ఎలిమెంట్స్‌ను వదలకుండానే, మానవ సంబంధాలు, కుటుంబ విలువలు , సామాజిక అంశాలను అద్భుతంగా తెరకెక్కించడంలో ఆయన దిట్ట. కృష్ణవంశీ ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 'శివ', 'గాయం' వంటి సినిమాలకు పనిచేశారు.1995లో నాగార్జున నిర్మాణంలో వచ్చిన 'గులాబీ' సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్ సాధించింది.

Krishna Vamsi : ఆహుతి ప్రసాద్ నాకు క్లోజ్.. కానీ చివరి చూపు కోసం అందుకే వెళ్లలేదు.. డైరెక్టర్ కృష్ణ వంశీ..
Krishna Vamsi, Ahuti Prasad
Rajitha Chanti
|

Updated on: Jun 20, 2026 | 8:21 PM

Share

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమ, నటీనటుల మధ్య ఉండే సంబంధాలు, తన వ్యక్తిగత నమ్మకాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా, తనతో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉన్న ఆహుతి ప్రసాద్, ఎమ్మెస్ నారాయణ వంటి నటులు మరణించినప్పుడు వారి భౌతిక కాయాలను చూడటానికి ఎందుకు వెళ్ళలేదో ఆయన స్పష్టం చేశారు. కృష్ణవంశీ మాట్లాడుతూ..తనకు ఎవరైనా మరణిస్తే వారిని ఆ స్థితిలో చూడటం అస్సలు ఇష్టం ఉండదని చెప్పారు.. వారు బతికి ఉన్నప్పుడు నవ్వుతూ, ఎనర్జిటిక్‌గా, తనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన జ్ఞాపకాలను మాత్రమే తన మనసులో ఉంచుకోవాలని ఆశిస్తానని తెలిపారు. ప్రాణం లేని ఆ నిస్సహాయ స్థితిలో వారిని చూడటం తన వల్ల కాదని, అందుకే తాను ఎవరి అంత్యక్రియలకు లేదా చివరి చూపునకు వెళ్ళనని వివరించారు. మరణించిన వ్యక్తి ఎలాగూ వెళ్ళిపోయారని, తాను వెళ్ళినా వెళ్ళకపోయినా వారికి వచ్చే తేడా ఏమీ ఉండదని ఆయన అన్నారు. కేవలం సమాజం కోసం లేదా లోకం కోసం తనకు నచ్చని, నమ్మని పనులను తాను చేయనని ఆయన తేల్చి చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం..

కృష్ణవంశీ మాట్లాడుతూ, ఆహుతి ప్రసాద్ తనకు ఎంతో ఆత్మీయుడని, వారిద్దరి మధ్య ఎంతో బలమైన వ్యక్తిగత అనుబంధం ఉండేదని గుర్తుచేసుకున్నారు. అయినప్పటికీ ఆయన మరణించిన సమయంలో భౌతిక కాయాన్ని చూడటానికి తాను వెళ్ళలేదని స్పష్టం చేశారు. దానికి గల ప్రధాన కారణాన్ని వివరిస్తూ, తనకు ఎవరైనా చనిపోతే వారి రూపాలను చూడటం అస్సలు ఇష్టం ఉండదని చెప్పారు. “ఆహుతి ప్రసాద్ బ్రతికి ఉన్నప్పుడు నాతో నవ్వుతూ, ఎనర్జిటిక్‌గా మాట్లాడిన ఆ సంతోషకరమైన జ్ఞాపకాలు మాత్రమే నా మనసులో నిలిచిపోవాలని నేను కోరుకుంటాను. ప్రాణం పోయి నిస్సహాయంగా పడి ఉన్న ఆ స్థితిని చూసి నా మైండ్‌లో ఉన్న వారి మంచి గుర్తులను చెరిపేసుకోలేను” అని కృష్ణవంశీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..

ఇదే ఇంటర్వ్యూలో సినిమా రంగంలో వచ్చే వివాదాలపై కూడా ఆయన స్పందించారు. సినీ పరిశ్రమ అనేది భావోద్వేగాలతో ముడిపడి ఉన్న రంగమని, ఇక్కడి వారు సాధారణ ప్రజల కంటే ఎక్కువ సున్నితంగా ఉంటారని తెలిపారు. ఒక విజయం రాగానే కొందరిలో అహంకారం పెరుగుతుందని, అలాంటి సమయంలో చిన్న చిన్న విభేదాలు వస్తాయని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..

Follow Us