AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఒక్కోసారి చిన్న సినిమాలు కూడా సంచలన విజయాలు సాధిస్తుంటాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంటాయి. ఈ సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కొద్ది రోజుల క్రితమే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 20, 2026 | 6:37 PM

Share

థియేటర్లలో ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అందులోనూ సీనియర్ హీరో, హీరోయిన్లు. దీంతో చాలా మంది ఈ సినిమాను లైట్ గా తీసుకున్నారు. అయితే ఒక్కోసారి చిన్న సినిమాలు కూడా సంచలనాలు నమోదు చేయవచ్చని ఈ మూవీ నిరూపించింది. కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. రూ. 15 కోట్లతో ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తే ఇప్పటివరకు ఈ సినిమాకు రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఈ మూవీ ఆడుతోంది. అయితే అంతలోనే ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఓటీటీలో సందడి చేయనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు బ్లాస్ట్. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించిన ఈ మూవీ తెలుగులో బ్లాస్ట్ జోన్ గా రిలీజైంది. మే 28న రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది.

బ్లాస్ట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో గురువారం (జూన్ 25) నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఓటీటీ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

బ్లాస్ట్ సినిమా విషయానికి వస్తే సుభాష్ కె రాజ్ అనే కుర్రాడు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అతనికి ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. అయినా తన టేకింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు సుభాష్. ఈ చిత్రంలో అర్జున్ సర్జాతో పాటు చెప్పవే చిరుగాలి హీరోయిన్ అభిరామి, కన్నప్ప ఫేమ్ ప్రీతి ముకుందన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి బ్లాస్ట్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

నెట్ ఫ్లిక్స్ లో బ్లాస్ట్ జోన్ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us