బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న వైష్ణవి చైతన్య..
20 June 2026
Pic credit - Instagram
Rajeev
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్స్ లో వైష్ణవి చైతన్య ఒకరు. ఆమె గురించిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి
యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌ల ద్వారా వైష్ణవి తన కెరీర్‌ను ప్రారంభించింది. ముఖ్యంగా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది.
ఈ అమ్మడు హీరోయిన్ గా మారడానికి ముందు అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమాలో హీరో చెల్లెలిగా నటించింది.
అలాగే నితిన్ హీరోగా నటించిన 'రంగ్ దే' సినిమాలో చిన్న పాత్రలలో కనిపించింది.. అలాగే మరికొన్ని సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.
వైష్ణవి కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా 'బేబీ'. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రంలో ఆసూపర్ హిట్ అయ్యింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, నటిగా వైష్ణవికి మంచి గుర్తింపు తెచ్చునది. ప్రస్తుతం ఎపిక్ అనే సినిమా చేస్తుంది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ఓ ప్రాజెక్ట్‌లో అలాగే శర్వానంద్ వంటి యంగ్ హీరోల సినిమాల్లోనూ ఆమె హీరోయిన్ గా చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది.