AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coriander Chicken: గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి మసాలాలు లేని హెల్తీ కొత్తిమీర కోడి కూర

ఈ రోజుల్లో చికెన్ కూర అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది దంచికొట్టిన గరం మసాలాలు, ఘాటైన మసాలా పొడులు. అయితే అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి, అలాగే మసాలాలు పడని వారికి ఈ ఘాటైన కూరలు తింటే కడుపులో మంట పుడుతుంది. మరి అలాంటి వారు చికెన్ తినడం మానేయాలా? అస్సలు అవసరం లేదు! ఎలాంటి గరం మసాలాలు వాడకుండా, ఎంతో కమ్మగా, చిక్కటి గ్రేవీతో ఉండే అద్భుతమైన "కొత్తిమీర చికెన్ కూర" (Coriander Chicken) ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతోంది. 

Phani CH
|

Updated on: Jun 20, 2026 | 6:36 PM

Share
కొత్తిమీర చికెన్ కూర ఒంటికి చలువు చేయడమే కాకుండా, కడుపుకు ఎంతో హాయిని ఇస్తుంది. ఈ రుచికరమైన కూరను తయారు చేయడానికి ముందుగా అడుగు మందంగా ఉండే కడాయిలో ఐదారు స్పూన్ల నూనె వేడి చేయాలి. అందులో మూడు మీడియం సైజు ఉల్లిపాయల సన్నని ముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.

1 / 5
తర్వాత కొద్దిగా పసుపు, ఒక కేజీ శుభ్రం చేసిన చికెన్ వేసి హై ఫ్లేమ్ మీద ఐదారు నిమిషాలు వేయించి, ఆపై మూత పెట్టి లో ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి. చికెన్ మగ్గేలోపు ఒక కప్పు నిండా తాజా కొత్తిమీర, కొద్దిగా అల్లం, 10-15 వెల్లుల్లి రెబ్బలు, 5-6 పచ్చిమిర్చి వేసి నీళ్లు పోయకుండా మిక్సీలో మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.

2 / 5
ఇప్పుడు మగ్గుతున్న చికెన్ లో తగినంత కారం వేసి, చికెన్ లోని నీరంతా పూర్తిగా ఇగిరిపోయి నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చటి కొత్తిమీర-అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కూరలో వేసి రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించాలి.

3 / 5
ఈ మసాలా ముక్కలకు బాగా పట్టిన తర్వాత, గ్రేవీ కోసం కొన్ని వేడి నీళ్లను పోసి, ఉప్పు అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లో మరికొంత సేపు ఉడికించుకోవాలి. కూర చక్కగా ఉడికిన తర్వాత నూనె పైకి తేలుతుంది. చికెన్ ముక్క సాఫ్ట్ గా ఉడికి, గ్రేవీ చిక్కబడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం పులుపు ఇష్టపడేవారు చివర్లో కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు.

4 / 5
అంతే, ఎలాంటి గరం మసాలా పొడులు వాడకపోయినా అస్సలు నీచు వాసన రాకుండా, కొత్తిమీర ఫ్లేవర్‌తో గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. దీనిని వేడి వేడి అన్నం, బగారా రైస్, చపాతీ లేదా జొన్న రొట్టెల్లోకి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఇచ్చే ఈ సింపుల్ చికెన్ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి!

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!