AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూనియర్ చిరంజీవి రాజ్ కుమార్ గుర్తున్నారా? ఇప్పుడెలా ఉన్నారు, ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

రాజ్ కుమార్.. అచ్చం మెగాస్టార్ చిరంజీవిని పోలి ఉంటే ఈ నటుడు ఒకప్పుడు తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే పలు సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. అయితే ఇప్పుడీ జూనియర్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.

జూనియర్ చిరంజీవి రాజ్ కుమార్ గుర్తున్నారా? ఇప్పుడెలా ఉన్నారు, ఏం చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Raj Kumar
Basha Shek
|

Updated on: Jun 20, 2026 | 8:05 PM

Share

లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణ రావు శిష్యుల్లో రాజ్ కుమార్ కూడా ఒకరు. దాసరి తెరకెక్కించిన ‘అమ్మ రాజీనామా’ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు రాజ్ కుమార్. ఆ తరవాత ‘నాగబాల, సంసారాల మెకానిక్’, కాలేజీ బుల్లోడు’ ‘పెద్దన్నయ్య’, ఇలా పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా, సహాయక నటుడిగా మెప్పించారు రాజ్ కుమార్. అయితే ఈయన చూడడానికి అచ్చం మెగాస్టార్ చిరంజీవిలా కనిపిస్తారు. దీంతో అందరూ ఈ నటుడిని జూనియర్ చిరంజీవి అని పిలిచేవారు. కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెరపైనా అదరగొట్టారు రాజ్ కుమార్. విధి, మనోయజ్ఞం వంటి సూపర్ హిట్ సీరియల్స్ తో టీవీ ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారీ ట్యాలెంటెడ్ యాక్టర్. తెలుగుతో పాటు కన్నడంలోనూ సినిమాలు చేశారాయన. నిర్మాతగానూ ట్రై చేశారు. అయితే చాలా మంది హీరోల్లాగే రాజ్ కుమార్ కు కూడా వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. అవకాశాలు తగ్గిపోయాయి. అదే సమయంలో నిర్మాతగా సినిమాలు చేసి బాగా నష్టపోయాడని పుకార్లు కూడా వచ్చాయి.

కాగా చిరంజీవి లాగా పోలికలు ఉండటం వల్లే తాను సక్సెస్ కాలేకపోయానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రాజ్ కుమార్. ‘నేను చిరంజీవి పోలికలతో ఉండటం చూసేవారికి గొప్పగా ఉంటుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం అది నాకు మైనస్ పాయింట్. మెగాస్టార్ పోలికలతో ఉన్నందుకు నేను చాలా గర్వపడతాను.  చిరంజీవిలా ఉంటానే కానీ.. ఆయనకు ఎక్కడా కూడా సరిపోను. ఆయనొక దిగ్గజం. నన్ను ఆయనతో పోల్చే సరికి మర్రిచెట్టు కింద కలుపు మొక్కలా అయిపోయా.ను తెలుగులో జూనియర్ చిరంజీవిగా ఇండస్ట్రీలో గుర్తింపు రావడంతో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లిపోయా. సినిమా ఇండస్ట్రీలో నన్ను తొక్కేశారన్నారు. అలా జరిగి ఉంటే నేను సీరియల్స్‌లో కూడా కనిపించేవాడిని కాదు’ అని రాజ్ కుమార్ పేర్కొన్నారు.

చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు రాజ్ కుమార్. బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. అయితే రాజ్ కుమార్ కు రాజకీయాలపైనా ఆసక్తి ఉంది. చంద్రబాబును బాగా అభిమానించే ఆయన 1996లోనే టీడీపీలో చేరారు. క్రియాశీల కార్యకర్తగా ఉంటోన్న రాజ్ కుమార్ ప్రతీ ఎన్నికలకు టీడీపీకి యాడ్స్ చేయిస్తున్నారట. ఇక మూడేళ్ల క్రితం చంద్రబాబు జైలు నుంచి విడుదలైనప్పుడు కూడా రాజ్ కుమార్ పూజలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన 2024 ఎన్నికల్లోనూ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు. టీడీపీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబు, ఆయన పార్టీ కోసం మాత్రం పని చేస్తానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు రాజ్ కుమార్.

ఇవి కూడా చదవండి

చంద్రబాబు నాయుడుతో రాజ్ కుమార్..

Chandrababu Naidu, Raj Kuma

Chandrababu Naidu, Raj Kumar

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బుడ్డోడికి క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే..!
బుడ్డోడికి క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే..!
శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..
శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..
బంకుల్లో కల్తీ పెట్రోల్‌ను గుర్తించడం ఎలా? సింపుల్‌ ట్రిక్స్‌..!
బంకుల్లో కల్తీ పెట్రోల్‌ను గుర్తించడం ఎలా? సింపుల్‌ ట్రిక్స్‌..!
మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!
మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!
పూర్వీకుల వంటింటి అమృతం.. మన నానమ్మల సీక్రెట్ ఈ పచ్చడే..
పూర్వీకుల వంటింటి అమృతం.. మన నానమ్మల సీక్రెట్ ఈ పచ్చడే..
వచ్చేస్తున్నాడు అసలైన కింగ్.. ఇంగ్లాండ్ ఇక కాచుకోండి..
వచ్చేస్తున్నాడు అసలైన కింగ్.. ఇంగ్లాండ్ ఇక కాచుకోండి..
వానాకాలంలో అమ్మచేతి అల్లం టీ.. దీన్ని వెనకున్న సైన్స్ తెలిస్తే..
వానాకాలంలో అమ్మచేతి అల్లం టీ.. దీన్ని వెనకున్న సైన్స్ తెలిస్తే..
గురు, శని గ్రహాల్లో మార్పులు.. వీరికి ఊహించని ధన లాభం
గురు, శని గ్రహాల్లో మార్పులు.. వీరికి ఊహించని ధన లాభం
జాగ్రత్త.. ఈ రాశుల వారు అప్పులు ఇస్తే సమస్యల్లో పడతారు
జాగ్రత్త.. ఈ రాశుల వారు అప్పులు ఇస్తే సమస్యల్లో పడతారు
సుమ యాక్టింగ్, మాట్లాడటం నా దగ్గరే నేర్చుకుంది..
సుమ యాక్టింగ్, మాట్లాడటం నా దగ్గరే నేర్చుకుంది..