AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: మొన్న చిరంజీవి సినిమాలో.. ఇప్పుడేమో బిగ్‌బాస్ తెలుగు 10లోకి.. బంపరాఫర్ కొట్టేసిందిగా..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో పాల్గొనే కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పలువురు బుల్లితెర ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ జాబితాలో ఎక్కువగా కాంట్రవర్సీ పర్సనాలిటీసే ఉండడం గమనార్హం.

Bigg Boss Telugu 10: మొన్న చిరంజీవి సినిమాలో.. ఇప్పుడేమో బిగ్‌బాస్ తెలుగు 10లోకి.. బంపరాఫర్ కొట్టేసిందిగా..
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Jun 20, 2026 | 8:55 PM

Share

బిగ్‌బాస్ తెలుగు 10 సీజన్‌కు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఈ సీజన్ పై మరింత ఆసక్తి పెంచుతున్నారు. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కావొచ్చు. ఈసారి కూడా అక్కినేని అక్కినేని నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. పదో సీజన్ కావడంతో ఈ సారి బిగ్ బాస్ షోకు మరిన్ని హంగులు తీసుకురానున్నారు. కంటెస్టెంట్ల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే గేమ్స్, టాస్కుల విషయంలోనూ చాలా సర్ ప్రైజెస్ ఉంటాయని తెలుస్తోంది. కాగా ఈసారి షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లపై ఊహాగానాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ, జబర్దస్త్ వర్ష, వర్షిణీ, ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు చంద్రహాస్‌ ఇలా చాలా మంది సెలబ్రిటీలు హౌస్ లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడీ జాబితాలో ప్రముఖ యూట్యూబర్ నందన పేరు కూడా బాగా వినిపిస్తోంది.

‘నందుస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానెల్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది నందన. ట్రావెలింగ్ వీడియోలు, లైఫ్ స్టైల్ కంటెంట్, పర్సనల్ పోస్ట్ లతో ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇదే క్రేజ్ తోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంలోనూ ఓ పాత్రలో నటించిందీ అందాల తార. ఇక ఇటీవల వీసాకు సంబంధించిన వివాదంతోనూ బాగా వార్తల్లో నిలిచింది నందన. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీయడంతో, ఆమెకు మరింత గుర్తింపు పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్ఆయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రియాలిటీషోకు నందనను తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారని, నందన, బిగ్ బాస్ నిర్వాహకుల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఒకవేళ నందన బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వస్తే మాత్రం హౌస్ లో ఎంటర్ టైన్మెంట్ కు ఏ మాత్రం కొదవ ఉండదని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

యూబ్యూబర్ నందన లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Nandana (@nandu_world)

View this post on Instagram

A post shared by Nandana (@nandu_world)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఈ కాంట్రవర్సీ యూట్యూబర్ ఎంట్రీ పక్కా!
బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఈ కాంట్రవర్సీ యూట్యూబర్ ఎంట్రీ పక్కా!
ఉదయం లేదా రాత్రి, ఏ సమయంలో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది?
ఉదయం లేదా రాత్రి, ఏ సమయంలో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది?
ఎదుటివారు అబద్ధం చెప్తున్నారా..? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా..
ఎదుటివారు అబద్ధం చెప్తున్నారా..? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా..
నాలుగు రోజులు ఓపిక పడితే చాలు.. వీరి ఇంట కనక వర్షమే
నాలుగు రోజులు ఓపిక పడితే చాలు.. వీరి ఇంట కనక వర్షమే
సిల్క్,శాటిన్ మధ్య తేడా ఏంటి? ఒరిజినల్ పట్టును గుర్తించే చిట్కాలు
సిల్క్,శాటిన్ మధ్య తేడా ఏంటి? ఒరిజినల్ పట్టును గుర్తించే చిట్కాలు
ఆ నటుడి చివరి చూపు కోసం అందుకే వెళ్లలేదు..
ఆ నటుడి చివరి చూపు కోసం అందుకే వెళ్లలేదు..
చరిత్ర సృష్టించిన రోహిత్.. ద్రవిడ్, గంగూలీ రికార్డులు బ్రేక్
చరిత్ర సృష్టించిన రోహిత్.. ద్రవిడ్, గంగూలీ రికార్డులు బ్రేక్
పిల్లలకు ఏ వయసు వరకు ట్రైన్‌లో టికెట్ అవసరం లేదు..
పిల్లలకు ఏ వయసు వరకు ట్రైన్‌లో టికెట్ అవసరం లేదు..
ఒంటి నొప్పులను తరిమికొట్టే బామ్మల నాటి అటుకుల వడలు..
ఒంటి నొప్పులను తరిమికొట్టే బామ్మల నాటి అటుకుల వడలు..
రైలు కింద పడ్డ ఎద్దు.. ప్రాణాలు పణంగా పెట్టి కాపాడిన లోకో పైలట్!
రైలు కింద పడ్డ ఎద్దు.. ప్రాణాలు పణంగా పెట్టి కాపాడిన లోకో పైలట్!