Simran : 25 ఏళ్లుగా నాతోనే ఉన్నారు.. ఇప్పుడు ఆయన లేరు అంటే నమ్మలేకపోతున్నా.. ఎమోషనల్ అయిన సిమ్రాన్

సనమ్ హార్‌జాయె అనే హిందీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సిమ్రాన్. ఆ తర్వాత తెలుగులో, తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. సిమ్రాన్ తన నటనతోనే కాదు గ్లామర్ తోనూ కవ్వించింది ఈ చిన్నది. సన్నజాజి తీగలాంటి సొగసుతో కవ్వించింది ఈ బ్యూటీ. తెలుగులో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల సరసన నటించింది.

Simran : 25 ఏళ్లుగా నాతోనే ఉన్నారు.. ఇప్పుడు ఆయన లేరు అంటే నమ్మలేకపోతున్నా.. ఎమోషనల్ అయిన సిమ్రాన్
Simran
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 11, 2023 | 12:40 PM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన భామల్లో సిమ్రాన్ ఒకరు. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ సుందరి. అప్పట్లో సిమ్రాన్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సనమ్ హార్‌జాయె అనే హిందీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సిమ్రాన్. ఆ తర్వాత తెలుగులో, తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. సిమ్రాన్ తన నటనతోనే కాదు గ్లామర్ తోనూ కవ్వించింది ఈ చిన్నది. సన్నజాజి తీగలాంటి సొగసుతో కవ్వించింది ఈ బ్యూటీ. తెలుగులో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల సరసన నటించింది. అలాగే మహేష్ బాబుతో కూడా నటించింది యువ రాజు సినిమాలో మహేష్ తో కలిసి నటించింది సిమ్రాన్.

ప్రస్తుతం సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తోంది సిమ్రాన్. ఆమె నటించిన సూర్య సన్నాఫ్ క్రిషన్ సినిమాలోనూ తన నటనతో మెప్పించింది. ఇదిలా ఉంటే తాజాగా సిమ్రాన్ ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సిమ్రాన్ మేనేజర్ కామరాజన్ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. దాంతో సిమ్రాన్ ఎమోషనల్ అయ్యారు. కామరాజన్ మరణాన్ని నమ్మలేకపోతున్నానని సిమ్రాన్ అన్నారు. 25 ఏళ్లుగా ఆయన తన వెంట ఉన్నారని. కుడి భుజంగా ఆయన ఎప్పుడు తన పక్కనే ఉన్నారు అని తెలిపింది సిమ్రాన్. కామరాజన్ చాలా యాక్టివ్ గా ఉండేవారని. కామరాజన్ లేకుండా తన సినీ ప్రయాణాన్ని ఊహించుకోలేనని ఎమోషనల్ అయ్యారు సిమ్రాన్. కామరాజన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సిమ్రాన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..