AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha : ఆ సినిమా నుంచి సమంత అవుట్.. ఆమె ప్లేస్‌లో క్రేజీ హీరోయిన్

యశోద సినిమా దగ్గర నుంచి ఆమె నటించిన శాకుంతలం, ఖుషి సినిమాలు నిరాశపరిచాయి. సమంత తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ సినిమాలు చేసి బిజీగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత చాలా సినిమాలకు కమిట్ అయ్యింది. అయితే ఇప్పుడు సినిమాలకు బ్రేక్ తీసుకోవడంతో..

Samantha : ఆ సినిమా నుంచి సమంత అవుట్.. ఆమె ప్లేస్‌లో క్రేజీ హీరోయిన్
Samanta
Rajeev Rayala
|

Updated on: Jan 25, 2024 | 9:48 AM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో సమంత నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. యశోద సినిమా దగ్గర నుంచి ఆమె నటించిన శాకుంతలం, ఖుషి సినిమాలు నిరాశపరిచాయి. సమంత తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ సినిమాలు చేసి బిజీగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత చాలా సినిమాలకు కమిట్ అయ్యింది. అయితే ఇప్పుడు సినిమాలకు బ్రేక్ తీసుకోవడంతో ఇప్పుడు ఆ ఆమె పాత్రలో కొత్త హీరోయిన్స్ కు స్టార్ హీరోయిన్స్ ను తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు సమంత కమిట్ అయిన ఓ సినిమాలో హీరోయిన్ గా మరో క్రేజీ హీరోయిన్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.

సమంత గతంలో ఇండో-బ్రిటీష్ ప్రాజెక్ట్ కోసం డౌన్‌టౌన్ అబ్బే దర్శకుడు ఫిలిప్ జాన్‌తో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ సినిమాలో సమంత ప్లేస్ లోకి మరో హీరోయిన్ వచ్చిందని తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రుతిహాసన్. ఎస్ ఇప్పుడు సమంత ప్లేస్‌లోకి శ్రుతిహాసన్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.

ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్ లో వివేక్ కల్రాతో పాటు శ్రుతిహాసన్ కూడా నటిస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో శ్రుతి నటించనుంది. ఇంగ్లీష్, కొద్దిగా తమిళం, వెల్ష్ తో ఉంటుందని తెలుస్తోంది. సునీత తాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్ ఇటీవలే సలార్ సినిమాతో భారీ హిట్ ను అందుకుంది. ఇప్పుడు ఈ చిన్నది తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

 శ్రుతిహాసన్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి