Tollywood: నా చిలుక పోయింది.. వెతికి కాల్ చేయాలంటూ హీరోయిన్ పోస్ట్..
అయితే కొన్నిసార్లు తమ పెంపుడు జీవాలు మిస్సవుతుంటాయి. దీంతో పోలీసులను ఆశ్రయిస్తూ ఎలాగైన వెతికి పెట్టాలంటూ రిక్వెస్ట్ చేస్తుంటారు. అలాగే ప్రకటనలు కూడా ఇస్తుంటారు. కాంటాక్ట్ నంబర్స్, మెయిల్ ఐడీస్ కూడా ఇచ్చి తమ పెంపుడు జీవాలను వెతికి పెట్టాలంటూ ఫాలోవర్లను వేడుకుంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తన చిలుక పోయిందంటూ ఆవేదన చెందుతుంది. తన చిలుకను ఎలాగైన వెతికి పెట్టమని కోరుతుంది. ఇంతకీ ఆ నటి ఎవరా అనుకుంటున్నారా.. ?
సాధారణంగా సెలబ్రెటీలు తమ ఇంట్లో ఎన్నో రకాల పెట్స్ పెంచుకుంటారు. కుక్క పిల్లలు, పిల్లులు, పక్షులను ప్రేమగా చూసుకుంటారు. ఇంటి సభ్యుల మాదిరిగానే తమ పెంపుడు జంతువులను కూడా చూసుకుంటారు. ఇక వాటికి ఏ చిన్న గాయమైన అల్లాడిపోతుంటారు. సోషల్ మీడియా ఖాతాలలో తమ పెట్స్ ఫోటోస్ షేర్ చేస్తూ ప్రేమను కురిపిస్తారు. అయితే కొన్నిసార్లు తమ పెంపుడు జీవాలు మిస్సవుతుంటాయి. దీంతో పోలీసులను ఆశ్రయిస్తూ ఎలాగైన వెతికి పెట్టాలంటూ రిక్వెస్ట్ చేస్తుంటారు. అలాగే ప్రకటనలు కూడా ఇస్తుంటారు. కాంటాక్ట్ నంబర్స్, మెయిల్ ఐడీస్ కూడా ఇచ్చి తమ పెంపుడు జీవాలను వెతికి పెట్టాలంటూ ఫాలోవర్లను వేడుకుంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తన చిలుక పోయిందంటూ ఆవేదన చెందుతుంది. తన చిలుకను ఎలాగైన వెతికి పెట్టమని కోరుతుంది. ఇంతకీ ఆ నటి ఎవరా అనుకుంటున్నారా.. ? తన పేరు ఆఫ్రీన్ ఖాన్.
దక్షిణాది ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం చాలా ఫేమస్. పలు సీరియల్స్, సినిమాల్లో కీలకపాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ నటి దగ్గర కొన్ని పెంపుడు జంతువులు ఉన్నాయట. అందులో ఆఫ్రికన్ చిలుక కూడా ఒకటి. గత అయిదేళ్లుగా ఆ చిలుకను ప్రేమగా పెంచుకుంటుంది. ఆ చిలుకకు పాబ్లో అనే పేరు కూడా పెట్టుకుంది. తాజాగా ఆ చిలుక కనిపించలేదట. దీంతో ఎలాగైనా ఆ చిలుకను వెతికి పెట్టాలని.. తన దగ్గర ఆ చిలుక అయిదేళ్లుగా ఉందని.. ఇప్పుడు కనిపించకపోవడంతో ఎంతో బాధపడుతున్నామంటూ వరుస పోస్టులు చేస్తుంది. ఆ చిలుకను వెతికి తనకు చెప్పాలంటూ ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చింది.
ఇక ఆఫ్రీన్ ఫ్రెండ్స్, ఫాలోవర్స్ కూడా ఆ చిలుక కనిపిస్తే చెప్పాలంటూ పోస్టులు పెడుతున్నాయి. అయితే మరికొందరు మాత్రం ఆఫ్రీన్ పోస్ట్ పై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ చిలుకకు ఎంత బాధ కలిగితే వెళ్లిపోయిందో.. ఇప్పటికైనా స్వేచ్ఛ దొరికింది అంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆఫ్రీన్ కు ధైర్యం చెబుతున్నారు.
ఇన్ స్టా పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.