Samantha: హార్ట్ బ్రేక్.. నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత సమంత షాకింగ్ పోస్ట్..

నాగ చైతన్య, శోభితకు సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలు, ఫ్యాన్స్ విషెస్ తెలుపుతున్నారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. తన మాజీ భర్తకు మరో నటితో నిశ్చితార్థం జరగడంతో సమంత ఎలా స్పందిస్తుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Samantha: హార్ట్ బ్రేక్.. నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత సమంత షాకింగ్ పోస్ట్..
Naga Chaitanya
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 09, 2024 | 8:27 AM

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ నిన్న (ఆగస్టు 8న ) సైలెంట్ గా జరిగిపోయింది. కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆ ఫోటోలను నాగార్జున తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో నాగ చైతన్య, శోభితకు సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలు, ఫ్యాన్స్ విషెస్ తెలుపుతున్నారు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. తన మాజీ భర్తకు మరో నటితో నిశ్చితార్థం జరగడంతో సమంత ఎలా స్పందిస్తుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ రోజు సమంతా రూత్ ప్రభు వేరే కారణంతో హార్ట్ బ్రేక్ ఎమోజీని షేర్ చేసింది.

సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా, పర్సనల్ విషయాలు ఇలా అనేక విషయాలపై సోషల్ మీడియా ద్వారా ఫీడ్ బ్యాక్ ఇస్తుంటుంది. ఆగస్ట్ 8న, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. అలాగని ఇది నాగ చైతన్య నిశ్చితార్థానికి సంబంధించినది కాదు. భారత క్రీడాభిమానులకు ఆగస్టు 8 బోరింగ్ డేగా మారింది. చివరి క్షణంలో పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయిన వినేష్ ఫోగట్.. రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది.  ఆగస్టు 8 రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న సమంత బ్రోకెన్ హార్ట్ ఎమోజీని షేర్ చేసింది

సమంత రూత్ ప్రభు, నాగ చైతన్య చాలా ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే నాలుగేళ్ల తర్వాత వారి వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చాయి. వారిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు. విడాకులకు గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరీర్‌లో కొత్త ఊపు వచ్చింది. ఆఫర్లు పెరిగాయి. బాలీవుడ్ లోనూ సినిమాలు సిరీస్ లు చేస్తోంది సామ్. తన మాజీ భర్తను మరిచిపోయి విడాకులు తీసుకున్న సమంత ముందుకు సాగుతోంది. కాబట్టి నాగచైతన్య, శోభిత నిశ్చితార్థంపై సమంత ఎలాంటి వ్యాఖ్యలు చేయదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Samantha

 మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..