AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu Birthday: ఆరడుగుల అందగాడి పుట్టిన రోజు.. వేల చిన్నారుల గుండె చప్పుడు మా మహేష్ బాబు..

నేడు ఆ ఆరడుగుల అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. మంచి మనసున్నోడు అంతకు మించి భారీ అభిమానులున్నోడు.. నటనలో నయా స్టైలున్నోడు మన మహేష్ బాబు. తండ్రికి తగ్గ తనయుడు అన్నదానికి నిదర్శనం మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

Mahesh Babu Birthday: ఆరడుగుల అందగాడి పుట్టిన రోజు.. వేల చిన్నారుల గుండె చప్పుడు మా మహేష్ బాబు..
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Aug 09, 2024 | 7:30 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ పేరులో వైబ్రేషన్ ఉంది. ఆ పేరులో మత్తుంది.. ఆ పేరుకు ఓ రేంజ్ ఉంది. మహేష్ బాబు  కటౌట్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేడు ఆ ఆరడుగుల అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. మంచి మనసున్నోడు అంతకు మించి భారీ అభిమానులున్నోడు.. నటనలో నయా స్టైలున్నోడు మన మహేష్ బాబు. తండ్రికి తగ్గ తనయుడు అన్నదానికి నిదర్శనం మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు.

ఎంత సూపర్ స్టార్ అయినా చాలా సింపుల్ గా ఉంటారు మహేష్. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ అభిమానులను అలరిస్తున్నాడు మహేష్. నేడు మహేష్ పుట్టిన రోజు సందర్భంగా అభిమాను సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే నెల రోజుల ముందు నుంచి మహేష్ అభిమానులు సందడి చేస్తున్నారు.

మహేష్ సినిమా అయినా, ఆయన బర్త్ డే అయినా ఫ్యాన్స్ కు పెద్ద పండగ అనే చెప్పాలి. ఏ ఏరియా చూసిన జాతర వాతావరణం కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ .. విదేశాల్లోనూ మహేష్ బాబు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.  మహేష్ కొటౌట్స్ కు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, రక్తదానాలు, అన్నదానాలు అంటూ తమ హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇప్పుడు మహేష్ బాబు ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. మహేష్ ఎంత పెద్ద హీరోనో అంత మంచి మనసున్న మనిషి.. ఇప్పటికే వేల చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించాడు. వేల చిన్నారుల గుండె చప్పుడు మా మహేష్ బాబు.. అంటూ ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతుంటారు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!