Samantha : టాటూ తొలగించిన సమంత.. ఇక పై అలా చెయ్యొద్దంటున్న నెటిజన్స్
స్టార్ హీరోయిన్ సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారనుంది. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన సమంత.. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించారు. సమంత అందానికి, నటనకు ఫిదా కానీ కుర్రాడు ఉండడు. సమంత తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ నటిస్తూ మెప్పిస్తుంది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన సమంత ప్రస్తుతం సినిమాలు తగ్గించారు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దాదాపు టాలీవుడ్ లో అందరు హీరోల సరసన నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించి ఆకట్టుకుంది. అలాగే బాలీవుడ్ లోనూ ఆకట్టుకుంది. ఇక సమంత నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది సమంత. అదే సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించాడు. ఈ సినిమా తర్వాత చై, సామ్ ప్రేమలో పడ్డారు. ఆతర్వాత ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత కొన్నాళ్లకే ఈ జంట విడిపోయారు. ఈ ఇద్దరూ ఎందుకు విడిడిపోయారో ఇప్పటికీ బయటకు రాలేదు. విడిపోయిన తర్వాత ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా మారిపోయారు. ఇక సమంత మాయోసైటిస్ బారినపడిన విషయం తెలిసిందే. ఇప్పడిప్పుడు సామ్ మాయోసైటిస్ నుంచి కోలుకుంటుంది. ఇక సినిమాలకు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఇప్పుడు.. తిరిగి సినిమాల్లోకి రానుంది. హీరోయిన్ గానే కాదు నిర్మాతగానూ మారింది సమంత ఇటీవలే శుభం అనే సినిమాను కూడా పూర్తిచేసింది.
ఇదిలా ఉంటే తాజాగా సమంత సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో సమంత టాటూ గురించి నెటిజన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. సమంత చేతిపైన టాటూ చైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు వేయించుకుంది. అయితే ఇప్పుడు ఆ టాటూను తొలగించిందని అర్ధమవుతుంది. అయినా కూడా ఆ టాటూ కొద్దికొద్దిగా కనిపిస్తుంది. దాంతో నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. టాటూను తొలగించినట్లు కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేసింది. మీ స్వంత రియాలిటీని సృష్టించండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పై ప్రేమించిన వారి టాటూలు వేయించుకోకండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




