Sai Pallavi: సాయి పల్లవి చెల్లికి కాబోయే వరుడిని చూశారా..? అప్పుడే పెళ్లిపనులు మొదలయ్యాయిగా..
సాయి పల్లవి ఫిదా సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సాయి పల్లవి ఇటీవలే సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. దాంతో చాలా రూమర్స్ పుట్టుకొచ్చాయి.

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం. సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయి పల్లవి ఫిదా సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సాయి పల్లవి ఇటీవలే సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. దాంతో చాలా రూమర్స్ పుట్టుకొచ్చాయి. సాయి పల్లవి పెళ్లి చేసుకోబోస్తుందని అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పనుందని కూడా వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ వాటిలో నిజం లేదని తేలిపోయింది.
మరో వైపు సైది పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పి డాక్టర్ గా సెటిల్ అవ్వనుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో కూడా నిజం లేదని తేలిపోయింది. తాజాగా సాయి పల్లవి తన కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. నాగ చైతన్యతో కలిసి తండేల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది సాయి పల్లవి. నాగ చైతన్యతో కలిసి గతంలో లవ్ స్టోరీ అనే సినిమాలో నటించారు.
ఇదిలా ఉంటే సాయి పల్లవి ఇంట్లో త్వరలో శుభకార్యం జరగనుందని తెలుస్తోంది. సాయి పల్లవి సోదరి పూజ కన్నన్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. తన స్నేహితుడు వినీత్ ను పెళ్లాడనుంది పూజ. తాజాగా పూజా తన జీవిత భాగ్వస్వామిని పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అప్పుడే పూజా పెళ్లి పనులు మొదలయ్యాయి. తాజాగా చేతికి మెహందీ పెట్టుకొని పెళ్లి పనుల్లో సందడి చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పూజా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు తమిళ్ లో చితిరై సెవ్వానం అనే సినిమా చేసింది ఈ చిన్నది.
పూజా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
