AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: విరాట్ కోహ్లీ మరదలు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా ?..

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన అనుష్క.. పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఆమె చెల్లెలు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఈ విషయం మాత్రం అసలు ఎవరికీ తెలియదు. కానీ తెలుగులో వరుసగా మంచి మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందం, అభినయంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా ?..

Virat Kohli: విరాట్ కోహ్లీ మరదలు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా ?..
Virat Kohli
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 10, 2024 | 3:46 PM

బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంటలలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకటి. ఈ జోడికి వరల్డ్ వైడ్ ఎంతో ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన అనుష్క.. పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఆమె చెల్లెలు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఈ విషయం మాత్రం అసలు ఎవరికీ తెలియదు. కానీ తెలుగులో వరుసగా మంచి మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందం, అభినయంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా ?.. తనే హీరోయిన్ రుహాణి శర్మ. ముందుగా తమిళ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. చి…ల.. సౌ.. సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సహజ నటనతో మెప్పించిన ఈ హీరోయిన్.. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. హిట్, డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు చిత్రాల్లో నటించింది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించింది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న సైంధవ్ సినిమాలో కీలకపాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా ఈనెల 13న రిలీజ్ కానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కు వెళ్లిన రుహానీ.. అక్కడ తన లైఫ్, మూవీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. చిన్నప్పటి నుంచి వెంకీ సర్ సినిమాలు చేస్తూ పెరిగానని.. సైంధవ్ సినిమాలో నటించాక ఆయనకు పెద్ద అభిమానిగా మారానని.. ఇప్పుడు ఆయనతోనే సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కోరిక ఉండేదని.. కానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని… ఇప్పుడు సైంధవ్ సినిమాలో డాక్టర్ పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.

ఇక అదే సమయంలో ఓ విలేఖరి మాట్లాడుతూ.. అనుష్క శర్మతో మీ అనుబంధం ఎలా ఉంటుంది ? అని ప్రశ్నించింది. దీంతో హీరోయిన్ రుహాణి ఒక్కసారిగా షాకయ్యింది. ఈ విషయం గురించి ఎప్పుడూ ఎక్కడా మీడియా ముందు చెప్పలేదు.. మీకేలా తెలిసింది? అని తిరిగి క్వశ్చన్ చేసింది. ఇక ఆ తర్వాత రుహాణి మాట్లాడుతూ.. అనుష్క నాకు సోదరి అవుతుంది. విరాట్ బావ అవుతాడని తెలిపింది. “విరాట్ నాతో చాలా బాగుంటాడు. వాళ్లిద్దరూ ఫిల్టర్ లేకుండా చాలా సింపుల్ గా ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక రుహాణి శర్మకు విరాట్ బావ అవుతాడని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.\

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విమర్శలకు పంత్ స్ట్రాంగ్ రిప్లే..
విమర్శలకు పంత్ స్ట్రాంగ్ రిప్లే..
వేసవిలో ముఖం ప్రకాశవంతంగా ఉండాలంటే..పచ్చి పాలను ఈ విధంగా వాడండి
వేసవిలో ముఖం ప్రకాశవంతంగా ఉండాలంటే..పచ్చి పాలను ఈ విధంగా వాడండి
చుక్క నెత్తురు చిందించకుండానే పాక్‌ ఉక్కిరిబిక్కిరి!
చుక్క నెత్తురు చిందించకుండానే పాక్‌ ఉక్కిరిబిక్కిరి!
రైల్వే అభ్యర్ధులకు బిగ్‌ షాక్‌.. ఆ పరీక్షలు రద్దు చేసిన RRB..!
రైల్వే అభ్యర్ధులకు బిగ్‌ షాక్‌.. ఆ పరీక్షలు రద్దు చేసిన RRB..!
థియేటర్లలో స్టార్ హీరోస్ మూవీస్.. ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు,
థియేటర్లలో స్టార్ హీరోస్ మూవీస్.. ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు,
ప్రత్యర్థులను కవ్వించే విరాట్ ఇలా ఎందుకు మారాడో తెలుసా?
ప్రత్యర్థులను కవ్వించే విరాట్ ఇలా ఎందుకు మారాడో తెలుసా?
ఈ ఏడాది రెండో చంద్ర,సూర్య గ్రహణాలు ఎప్పుడు? సూత సమయం తెలుసుకోండి
ఈ ఏడాది రెండో చంద్ర,సూర్య గ్రహణాలు ఎప్పుడు? సూత సమయం తెలుసుకోండి
వేసవిలో కారు టైర్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెఫ్టీ ట్రిక్స్‌
వేసవిలో కారు టైర్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెఫ్టీ ట్రిక్స్‌
వార్‌ టెన్షన్‌.. ఇండియా, పాకిస్థాన్‌ మధ్యలో యూకే!
వార్‌ టెన్షన్‌.. ఇండియా, పాకిస్థాన్‌ మధ్యలో యూకే!
పదో తరగతి 2025 మెమోలపై..మార్కులతోపాటు పాస్, ఫెయిల్‌ ముద్రణ!
పదో తరగతి 2025 మెమోలపై..మార్కులతోపాటు పాస్, ఫెయిల్‌ ముద్రణ!