AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బేబీ బంప్‌తో డాన్స్ వేసిన యంగ్ హీరోయిన్.. నెటిజన్స్ ఏమంటున్నారంటే..

ఇటీవల సినిమా ఇండస్ట్రీలో చాలా మంది గుడ్ న్యూస్ తో అభిమానులను కుష్ చేస్తున్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ మొదలుపెట్టారు. అలాగే కొంతమంది అమ్మానాన్నలుగా ప్రమోషన్స్ అందుకున్నారు. తాజాగా ఓ అందాల భామ త్వరలోనే తల్లి కాబోతుంది .

బేబీ బంప్‌తో డాన్స్ వేసిన యంగ్ హీరోయిన్.. నెటిజన్స్ ఏమంటున్నారంటే..
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 07, 2026 | 4:09 PM

Share

చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ ఈ అమ్మడు. తన అందం అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. స్టార్ హీరోయిన్ గా మారిపోతుంది అని అంతా అనుకుంటున్నా సమయంలో పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది.. ఇక ఇప్పుడు ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తాజాగా బేబీ బంప్ తో డాన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఎవరో కాదు అందాల భామ రెబా మోనికా జాన్‌ 2016లో జాకోబిన్ట్ స్వర్గరాజ్యం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి మలయాళం, తమిళ్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత 2019 దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్రలో నటించి మెప్పించింది.

2023లో వచ్చిన బూ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది. తొలి సినిమాతోనే తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది రెబా మోనికా జాన్‌. ఆ తర్వాత వచ్చిన శ్రీవిష్ణు హీరోగా నటించిన సామజవరగమన మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత మ్యాడ్ స్క్వేర్ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. అలాగే తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలోనూ నటించింది రెబా మోనికా జాన్‌.

తెలుగులో చివరిగా శ్రీవిష్ణు నటించిన మృత్యుంజయ్ సినిమాలో కనిపించింది. ఇక ఈ అమ్మడు 2022లో జోయీమోన్ జోసెఫ్ వివాహం చేసుకుంది. త్వరలోనే ఈ చిన్నది తల్లి కానుంది. కాగా సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా రెబా తన భర్త జోమోన్ జోసెఫ్ తో కలిసి స్టెప్పులేస్తూ కనిపించింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బిడ్డ రాబోతున్న చివరి వారాల్లో మా రోజులు ఇలా గడుస్తున్నాయి అంటూ వీడియో షేర్ చేసింది రెబా మోనికా జాన్‌. ఈ వీడియోపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us