Chiranjeevi Mega 158: హనీరోజ్ ఔట్.. చిరంజీవి-బాబీ సినిమాలో క్రేజీ హీరోయిన్! అదృష్టం అంటే ఈ అమ్మడిదే
మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఓ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ ‘MEGA158’ (వర్కింగ్ టైటిల్) సినిమా రెగ్యులర్ షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా ఈ మెగా మూవీ గురించి ఒక ఆసక్తికరమైన కాస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

‘మెగాస్టార్’ చిరంజీవి , దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మెగా 158 (వర్కింగ్ టైటిల్) పేరుతో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శ రవేగంగా జరుగుతోంది. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కాగా ప్రముఖ కన్నడ నటి, డింపుల్ క్వీన్ రచితా రామ్ ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటించనుందన్న వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రజనీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రంలో నెగెటివ్ రోల్ తో ఆందరి దృష్టిని ఆకర్షించిన రచితా రామ్, ఇప్పుడు ఈ మెగాస్టార్ చిత్రంలోనూ ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుందని టాక్. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ విలక్షణమైన పాత్ర కోసం చిత్ర బృందం మొదట మలయాళ నటి హనీ రోజ్‌ను సంప్రదించింది. ఆమె మొదట్లో ఆసక్తి చూపినప్పటికీ, డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ పాత్ర కోసం రచిత రామ్‌ను తీసుకున్నారట. త్వరలోనే ఆమె పొల్లాచి షూటింగ్ షెడ్యూల్ లో చేరనుందని సమాచారం.
మెగా 158 మూవీని భారీ యాక్షన్ యాంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు డైరెక్టర్ బాబీ. ఇందులో భాగంగా కేవలం యాక్షన్‌కే కాకుండా హీరోయిన్లకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి, మలయాళ వర్ధమాన నటి అనస్వర రాజన్ ఈ క్రేజీ ప్రాజెక్టులో చేరారు. అనస్వర రాజన్ ఈ సినిమాలో చిరంజీవి కుమార్తె పాత్రలో కనిపించనుంది. దీంతో పాటు, గ్లామరస్ నటి నివేదా పేతురాజ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
సినిమా షూటింగ్ లో రచితా రామ్..
View this post on Instagram
‘టాక్సిక్’, ‘జన నాయగన్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ ‘కెవిఎన్ ప్రొడక్షన్స్’, ఇప్పుడు ‘మెగా 158’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. వెంకట్ కె. నారాయణ్, లోకేష్‌లు సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ సంగీత దర్శకుడు తమన్ ఎస్. ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ‘జైలర్’ ఫేమ్ విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




