AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వీడూ ఓ బౌలరేనా? అని తిట్టినోళ్లకు ఒక్క బాల్‌తో సమాధానం ఇచ్చి పడేశాడుగా..!

భారత్-ఆఫ్ఘానిస్థాన్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 564 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆఫ్ఘాన్ బ్యాటింగ్‌లో మానవ్ సుతార్ మొదటి వికెట్ తీయగా, అందరి దృష్టి ప్రసిద్ధ్ కృష్ణపై పడింది. గతంలో విమర్శలు ఎదుర్కొన్న ప్రసిద్ధ్, అద్భుతమైన బంతితో సెదిఖుల్లా అటల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి తన సత్తా చాటాడు.

Video: వీడూ ఓ బౌలరేనా? అని తిట్టినోళ్లకు ఒక్క బాల్‌తో సమాధానం ఇచ్చి పడేశాడుగా..!
Prasidh Krishna
SN Pasha
|

Updated on: Jun 07, 2026 | 3:59 PM

Share

ప్రస్తుతం టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శుబ్‌‌మన్ గిల్, ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగగా, అలాగే సాయి సుదర్శన్, రిషభ్ పంత్‌లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. రెండో రోజు 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఆఫ్ఘాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. ఆ జట్టును ఆరంభంలోనే తొలి మ్యాచ్ ఆడుతున్న మానవ్ సుతార్ దెబ్బ తీశాడు. తొలి వికెట్‌గా ఆదిల్ మాలిక్‌ను అవుట్ చేసి పెవిలియన్ పంపాడు.

ఆ తర్వాత ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో మరో వికెట్ పడింది. ఆఫ్ఘాన్ ఓపెనర్ సెదిఖుల్లా అటల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ బాల్ చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. ఈ వికెట్ పడిన తీరు చూసి ప్రతి క్రికెట్ అభిమాని గుండె నిండిపోవాల్సిందే. అంత చక్కని బాల్‌తో సెదిఖుల్లాను క్లీన్ బౌల్డ్ చేసింది ఎవరో తెలుసా? మొన్నటి వరకు వీడూ ఓ బౌలరేనా, అసలు వీడ్ని ఎందుకు టీమిండియాకు సెలెక్ట్ చేస్తున్నారంటూ అందరితో తిట్లు తిన్న బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ. మంచి హైట్, స్పీడ్‌తో బౌలింగ్ వేసే ప్రసిద్ధ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకా చాలా విమర్శలే ఎదుర్కొన్నాడు.

కానీ ఆఫ్ఘాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో అయితే అద్బుతమైన బాల్‌తో బ్యాటర్‌ వద్ద ఆన్సర్ లేకుండా చేశాడు. దీంతో తనపై వచ్చిన విమర్శలకు ఎంతో కొంత సమాధానం అయితే ఈ వికెట్‌తో చెప్పాడని అనుకోవచ్చు. ఇంకా ఈ మ్యాచ్లో చాలా గేమ్ మిగిలి ఉంది. ప్రస్తుతం ప్రసిద్ధ్ మంచి బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇంకా ఈ మ్యాచ్‌లో మరిన్ని వికెట్లు తీసి.. తనపై వచ్చిన విమర్శలకు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాలని అనుకుంటూ ఉంటాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో ప్రసిద్ధ్ మరిన్ని వికెట్లు తన ఖాతాలో వేసుకుంటాడో లేదో. ప్రస్తుతం ఆఫ్ఘాన్ 77 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
దిండు కింద నాణెం, ఈశాన్యంలో ఈ విగ్రహాలు.. మీ అదృష్టం మారడం ఖాయం
దిండు కింద నాణెం, ఈశాన్యంలో ఈ విగ్రహాలు.. మీ అదృష్టం మారడం ఖాయం
ఆ ఒక్క పొరపాటుతో లక్ష రూపాయల జరిమానా విధించిన రైల్వే..!
ఆ ఒక్క పొరపాటుతో లక్ష రూపాయల జరిమానా విధించిన రైల్వే..!
గ్యాస్ ట్రబుల్ అని లైట్ తీసుకోకండి! నివారణోపాయాలు ఇవే
గ్యాస్ ట్రబుల్ అని లైట్ తీసుకోకండి! నివారణోపాయాలు ఇవే
ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! వారానికి 4 రోజులే పని,3 సెలవులు?
ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! వారానికి 4 రోజులే పని,3 సెలవులు?
రూ.1699కే ఫీచర్ ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్‌.. ఫీచర్స్ అదుర్స్‌
రూ.1699కే ఫీచర్ ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్‌.. ఫీచర్స్ అదుర్స్‌
వామ్మో.. ఎంత పెద్ద పాములో.. ఒకేచోట రెండు నాగుల సయ్యాట..!
వామ్మో.. ఎంత పెద్ద పాములో.. ఒకేచోట రెండు నాగుల సయ్యాట..!
రాహు ప్రభావంతో వీరికి అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బే డబ్బు
రాహు ప్రభావంతో వీరికి అన్నింట్లో విజయమే, ఊహించని డబ్బే డబ్బు
హోటల్ స్టైల్ స్పైసీ ఉల్లిపాయ ఊరగాయ.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు
హోటల్ స్టైల్ స్పైసీ ఉల్లిపాయ ఊరగాయ.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు
అదిరే పెర్ఫామెన్స్‌తో మార్కెట్లోకి రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G
అదిరే పెర్ఫామెన్స్‌తో మార్కెట్లోకి రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G
జాతకంలో సూర్యుడు ఏ ఇంట్లో ఉన్నాడు? 12 భావాల్లో సూర్యుని ఫలితాలు..
జాతకంలో సూర్యుడు ఏ ఇంట్లో ఉన్నాడు? 12 భావాల్లో సూర్యుని ఫలితాలు..