Rashmika Mandanna: అందుకే యానిమల్ సక్సెస్‌కు దూరంగా ఉన్నా.. అసలు విషయం బయటపెట్టిన రష్మిక
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘యానిమల్’ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. గత ఏడాది బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన యానిమల్ సినిమా ఊహించని రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా పై కొందరు విమర్శలు చేశారు.

గత ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో యానిమల్ సినిమా ఒకటి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘యానిమల్’ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. గత ఏడాది బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన యానిమల్ సినిమా ఊహించని రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా పై కొందరు విమర్శలు చేశారు. యానిమల్ సినిమాలో హింసను ఎక్కువగా చూపించారని.. అసభ్యపదజాలం ఉపయోగించారని కొందరు విమర్శించారు. అయినా కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అలాగే చిత్ర బృందం మొత్తం యానిమల్ సినిమా విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. సినిమా గురించి, సినిమా సక్సెస్ గురించి మాట్లాడారు. కానీ రష్మిక మందన్న మాత్రం ‘యానిమల్’ సినిమా విడుదలైన తర్వాత సినిమా ఏ కార్యక్రమంలోనూ కనిపించలేదు. ‘యానిమల్’ సినిమాను రష్మిక మందన్న దూరం పెట్టిందనే వార్తలు జోరందుకున్నాయి, దీనిపై రష్మిక ఇప్పుడు స్పందించింది.
తన సొంత సినిమా విజయాన్ని సంబరాలు చేసుకోవడం లేదని పుకార్లు వస్తున్నాయని, దానిపై నేను సమాధానం చెప్పాలని రష్మిక చెప్పుకొచ్చింది. మేం సూపర్ హిట్ సినిమా ఇచ్చాం, జనాలు ఆదరించారు. సినిమా సక్సెస్‌ని అందరం ఎంజాయ్ చేయడానికి కొంత సమయం కేటాయించాలని అనుకున్నాను. కానీ నా సినిమా విడుదలైన మరుసటి రోజే నేను మరో సినిమా షూటింగ్ సెట్‌కి వెళ్ళాను అని తెలిపింది.
రష్మిక తన సోషల్ మీడియా పోస్ట్‌లో ‘యానిమల్’ సినిమా పేరును కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. దీని పై రష్మిక మాట్లాడుతూ.. ‘వరుస షూటింగ్స్ వల్లే నేను కొన్ని ఇంటర్వ్యూలు లేదా సక్సెస్ పార్టీలకు హాజరు కాలేకపోయాను. నేను సినిమాల కోసం రాత్రిపూట ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నా కెరీర్‌లో కొన్ని పెద్ద, ఇంటెన్స్ సినిమాల్లో నటిస్తున్నాను. అలాగే నేను నా సినిమాల లుక్స్ రివీల్ చేయను. నేను ఇంటర్వ్యూలలో పాల్గొనకపోవడానికి కూడా ఇదే కారణం. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసేందుకు నేను, నా టీమ్ ప్లాన్ చేస్తున్నాం. సినిమా సక్సెస్‌లో మీ ప్రమేయం లేనంత మాత్రాన సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేయడం లేదని కాదు. మన పని మనకంటే ఎక్కువ మాట్లాడాలని నేను నమ్ముతాను. సినిమా చూసి సంతోషిస్తున్న ప్రేక్షకుల నుంచి నాకు మెసేజ్‌లు వస్తున్నాయి. అదంతా చూస్తుంటే ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
