AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“తెలుగులో నటించడం క‌లే అనుకున్నా”

అగ్ర‌క‌థానాయకుల పక్క‌న న‌టిస్తూ, వ‌ర‌స విజయాలు అందుకుంటూ ప్ర‌స్తుతం మంచి జోరుమీదుంది హీరోయిన్ ర‌ష్మిక మంద‌న‌. త్వ‌ర‌లో ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఐదేళ్లు పూర్తి చేసుకోబోతుంది ఈ సుంద‌రాంగి.

తెలుగులో నటించడం క‌లే అనుకున్నా
Ram Naramaneni
|

Updated on: Aug 16, 2020 | 8:34 AM

Share

Actress Rashmika Mandanna : అగ్ర‌క‌థానాయకుల పక్క‌న న‌టిస్తూ, వ‌ర‌స విజయాలు అందుకుంటూ ప్ర‌స్తుతం మంచి జోరుమీదుంది హీరోయిన్ ర‌ష్మిక మంద‌న‌. త్వ‌ర‌లో ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఐదేళ్లు పూర్తి చేసుకోబోతుంది ఈ సుంద‌రాంగి. ఈ సంద‌ర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిపింది. ఎప్పుడైనా మూవీ ఫీల్డ్ వ‌దిలేసి వెళ్లాల‌నే ఆలోచ‌న వ‌చ్చిందా అనే ప్ర‌శ్న అడ‌గ్గా..చాలా పెద్ద స‌మాధాన‌మే చెప్పింది.

“వాస్త‌వానికి.. నాకు ఫ‌స్ట్ మూవీ చేసిన వెంటనే ఇలాంటి ఆలోచన వచ్చింది. నా ఫ‌స్ట్ సినిమా ‘కిరిక్‌ పార్టీ‌’ రిలీజ‌వ్వ‌గానే తెలుగు నుంచి అనేక ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. కానీ, అప్పటికి నేను సినిమాలే కంప్లీట్‌గా వ‌దిలేద్దామ‌నుకున్నా. తెలుగులో నటించడమైతే ఇక కుద‌ర‌ద‌నే అనుకున్నా. ఎందుకంటే తెలుగు భాష‌లో నాకు క‌నీస అవ‌గాహ‌న లేదు. దాంతో ఇటువైపు వ‌చ్చే ఆలోచ‌నే చేయ‌లేదు. కానీ, ఫస్ట్ విక్టరీ అందించిన ఉత్సాహం, స్ఫూర్తితో కొన్ని కన్నడ సినిమాలు సైన్ చేశా. దాంతో తెలుగు నుంచి ఛాన్సులొచ్చినా తొలి రెండేళ్లు ఇక్కడ మూవీస్ చెయ్యలేని పరిస్థితి ఏర్ప‌డింది. ఆ తర్వాత ‘కిరిక్‌ పార్టీ’ చూసి డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల ‘ఛలో’ కోసం నన్ను సంప్రదించారు. ఆయన చెప్పిన‌ స్టోరీ, అందులోని నా పాత్ర విపరీతంగా నచ్చి ఆ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చా. ఇక ఆ తర్వాత వరుస విజయాలతో తెలుగులో ముందుకు వెళ్తున్నా. ఇప్పుడీ ప్రయాణాన్ని తలచుకుంటుంటే ఓ డ్రీమ్‌లా అనిపిస్తుంటుంది”. అని రష్మిక వివ‌రించింది.

Also Read :

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు…స‌హాయం కోసం కంట్రోల్ రూమ్ నంబ‌ర్లు

గుడ్ న్యూస్ : తెలంగాణలో భారీగా పెరిగిన భూగర్భ జలాలు

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత