AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rambha: సల్మాన్‌తో నేను అలా చేసినందుకు రజినీకాంత్‌కు కోపం వచ్చింది.. దెబ్బకు కన్నీళ్లు పెట్టుకున్న రంభ

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ. రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రంభ. నటనతోనే కాకుండా తన అందాలతోనూ అప్పటి ప్రేక్షకులను కవ్వించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన రంభ.. తమిళ్ లోనూ సినిమాలు చేసింది.

Rambha: సల్మాన్‌తో నేను అలా చేసినందుకు రజినీకాంత్‌కు కోపం వచ్చింది.. దెబ్బకు కన్నీళ్లు పెట్టుకున్న రంభ
Ramba
Rajeev Rayala
|

Updated on: Jan 04, 2024 | 5:35 PM

Share

ఒకప్పుడు కుర్రకారును ఉర్రుతలూగించిన బ్యూటీస్ లో రంభ ఒకరు. ఈ ముద్దుగుమ్మ అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను అలరించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ. రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రంభ. నటనతోనే కాకుండా తన అందాలతోనూ అప్పటి ప్రేక్షకులను కవ్వించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన రంభ.. తమిళ్ లోనూ సినిమాలు చేసింది. అక్కడ కూడా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ, భోజ్ పూరి సినిమాలతో పాటు హాలీవుడ్ లోనూ ఓ సినిమా చేసింది రంభ. ఇక ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది.

పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది రంభ. తాజాగా ఈ చిన్నది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. రంభ తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి నటించిన విషయం తెలిసిందే. అరుణాచలం సినిమాలో రజనీకాంత్ పీఏగా గా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా సెట్ లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది రంభ.

అరుణాచలం సినిమా చేస్తున్నప్పుడే హిందీలో సల్మాన్ ఖాన్ తో కలిసి బంధన్ సినిమా కూడా చేశారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ హైదరాబాద్ లో జరిగాయి. దాంతో ఉదయమంతా అరుణాచలం షూటింగ్ మధ్యాహ్నం బంధన్ షూటింగ్ లో జాయిన్ అయ్యేదాన్ని అని తెలిపింది. ఓ సారి అరుణాచలం సెట్ కు సల్మాన్ ఖాన్ వచ్చాడు. నేను వెంటనే అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి హగ్ చేసుకున్నా.. అదంతా రజిని సార్ దూరం నుంచి చూస్తున్నారు. ఆతర్వాత ఆయన టవల్ ను విసిరి కొట్టి సీరియస్ గా డైరెక్టర్ తో మాట్లాడారు. నేను ఎం జరిగిందని కనుకుంటే అసలు విషయం చెప్పారు. ఎందుకమ్మా అలా చేశావ్.. ఇక మీతో నటించను అని రజినీసార్ అంటున్నారు అని అన్నారు అని కెమెరామెన్ చెప్పారు. దాంతో నేను బోరున ఏడ్చేశా. దాంతో రజినీకాంత్ సార్ వచ్చి నేను ఎలా పరిగెత్తుకుంటూ వెళ్లి సల్మాన్ ను హగ్ చేసుకున్నానో చేసి చూపించారు. ఆతర్వాత మా సినిమా సెట్ లో అయితే గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్ళిపోతుంది. అదే హిందీ హీరో అయితే హగ్ చేసుకుంటుంది అంటూ సరదాగా ఏడిపించారు అని తెలిపింది. నిజానికి రజిని సార్ ను నేను ఎప్పుడు అలా చూడలేదు అని తెలిపింది రంభ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us