Rakul Preet Singh: బాబోయ్.. రకుల్ పెళ్లికోసం ఎంచుకున్న హోటల్ గది ఒక్కరోజుకు అన్ని వేలా..!
వీరిద్దరూ ముందుగా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని అనుకున్నారు.. అయితే ఇప్పుడు పెళ్లి వేదికను గోవాకు షిఫ్ట్ చేశారు. గోవాలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వివాహానికి కొద్దిమంది అతిధులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్‌లో రకుల్, జాకీ పెళ్లి చేసుకోనున్నారు. ఐటీసీ గ్రాండ్ 246 గదులతో కూడిన విలాసవంతమైన హోటల్.

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ , జాకీ భగ్నాని ఫిబ్రవరి 21 న వివాహం చేసుకోనున్నారు. ఇప్పుడు ఇదే న్యూస్ అటు బీ టౌన్ ను ఇటు టాలీవుడ్ ను ఊపేస్తోంది. వీరిద్దరూ ముందుగా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని అనుకున్నారు.. అయితే ఇప్పుడు పెళ్లి వేదికను గోవాకు షిఫ్ట్ చేశారు. గోవాలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వివాహానికి కొద్దిమంది అతిధులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్‌లో రకుల్, జాకీ పెళ్లి చేసుకోనున్నారు. ఐటీసీ గ్రాండ్ 246 గదులతో కూడిన విలాసవంతమైన హోటల్. 45 ఎకరాల భూమిలో విస్తరించి ఉన్న ఈ రిసార్ట్ చాలా ప్రశాంతమైన ప్రదేశంలో ఉంది. జాకీ, రకుల్‌లు ఈ హోటల్‌ని ఎంచుకున్న వెంటనే.. చాలా మందికి దీని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది.
గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్‌లో గది ధర 19 వేల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఈ ధర 75 వేల రూపాయల వరకు ఉంది. ఇందులో చాలా పన్నులు కూడా ఉన్నాయి. మూడు రోజుల పాటు గోవాలో పెళ్లి వేడుక జరగనుంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ పెళ్లి పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా జరగనున్న సంగతి కూడా తెలిసిందే. “రకుల్, జాకీ ఏ అతిథికి పేపర్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. అదేవిధంగా వివాహ వేదిక వద్ద ఎలాంటి పటాకులు పేల్చరు’’ అని ఈవెంట్ మేనేజర్ వివరించారు.
రకుల్ ప్రీత్ , జాకీ అక్టోబర్ 2021లో తమ ప్రేమను బహిరంగంగా ఒప్పుకున్నారు. అప్పటి నుండి, ఇద్దరూ వివిధ పార్టీలు, ఈవెంట్లలో కలిసి కనిపించారు. లాక్‌డౌన్ సమయంలో ఒకరికొకరు సన్నిహితంగా మెలిగినట్లు రకుల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. “మా స్నేహం , సంబంధం చాలా సులభంగా ప్రారంభమైంది. మేము ఒకరితో ఒకరు స్నేహితులుగా గడిపాము అలాగే మూడు-నాలుగు నెలల్లో మేము ప్రేమలో పడ్డం. మేము ఇరుగుపొరుగు వాళ్లమని కూడా మొదట్లో తెలియదు. ఇన్నేళ్లలో మేమిద్దరం స్నేహితులం కూడా కాలేదు. కానీ లాక్‌డౌన్‌లో అంతా కలిసొచ్చింది” అని రకుల్ చెప్పుకొచ్చింది.
రకుల్ ప్రీత్ సింగ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
在 Instagram 查看这篇帖子
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




