Priyanka Mohan: వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో..! ప్రియాంక మోహన్‌కు నెటిజన్ వింత ప్రశ్న
అందమైన రూపంతో క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రియాంక మోహన్. ఆతర్వాత శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం సినిమాలో నటించింది ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. దాంతో ఈ చిన్నది తమిళ్ పై ఎక్కువ దృష్టి పెట్టింది. తమిళ్ లో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది.

ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల మనసు దోచేసిన ముద్దుగుమ్మల్లో ప్రియాంక మోహన్ ఖచ్చితంగా చెప్పాల్సిందే.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. అందమైన రూపంతో క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రియాంక మోహన్. ఆతర్వాత శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం సినిమాలో నటించింది ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. దాంతో ఈ చిన్నది తమిళ్ పై ఎక్కువ దృష్టి పెట్టింది. తమిళ్ లో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. ముఖ్యంగా శివకార్తికేయన్ హీరోగా నటించిన వరుణ్ డాక్టర్, డాన్ సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే హీరో సూర్యతో కలిసి సినిమా చేసింది.
ఇక ఇప్పుడు తెలుగులో బిజీగా మారింది ప్రియాంక మోహన్. ప్రస్తుతం నేచురల్ స్టార్ నానితో కలిసి సరిపోదా శనివారం అనే సినిమా చేస్తుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఓజీ అనే సినిమా చేస్తుంది ప్రియాంక.. ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ప్రియాంక మోహన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాదానాలు చెప్పింది ప్రియాంక. కాగా ఓ నెటిజన్ ప్రియాంకను ఓ వింత ప్రశ్న అడిగాడు. మీ గోర్లను చూపించండి అని అడిగాడు. మీ గోర్లను చూపించండి ఒక్కసారి చూడాలని ఉంది అని కోరాడు. దానికి ప్రియాంక తన గోర్లను ఫోటో తీసి షేర్ చేసింది. అయితే ఈ ఫోటో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వాడు ఏ ఉద్దేశంతో అడిగాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక మరికొంతమంది నెటిజన్స్ ప్రియాంక అందాన్ని పొగుడుతూ.. కామెంట్స్ చేస్తున్నారు. అందరికి థ్యాంక్స్ చెప్తూ రిప్లే ఇచ్చింది ప్రియాంకా మోహన్.
Vadu ey udesamtho adigado …🏃 pic.twitter.com/oAc08qFQPS
— 🕶️ (@Abdulpspk08) February 25, 2024
ప్రియాంక మోహన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




