AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Chopra: జామ పళ్లు అమ్మే మహిళ నిజాయతీకి ముగ్ధురాలైన ప్రియాంక చోప్రా.. అసలు ఏం జరిగిందంటే?

బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రా చాలా కాలంగా హాలీవుడ్‌లో నే స్థిరపడింది. ప్రస్తుతం ఆమె దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. మహేష్ బాబు ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం విశాఖపట్నం వచ్చిన ప్రియాంక అక్కడ జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను సోషల్ మీడియాలో పంచుకుంది.

Priyanka Chopra: జామ పళ్లు అమ్మే మహిళ నిజాయతీకి ముగ్ధురాలైన ప్రియాంక చోప్రా.. అసలు ఏం జరిగిందంటే?
Actress Priyanka Chopra
Basha Shek
|

Updated on: Mar 19, 2025 | 8:01 PM

Share

ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ నటి గా మారిపోయింది. బాలీవుడ్‌లో అగ్ర నటిగా ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం హాలీవుడ్‌లో తన అదృష్టం పరీక్షించుకుంటోంది. భారతీయ సినిమా తెరపై ఈ గ్లోబల్ బ్యూటీ కనిపించి చాలా రోజులయ్యింది. అయితే ఇప్పుడీ లోటును తీరుస్తూ చాలా సంవత్సరాల తర్వాత ఓ భారతీయ సినిమాలో నటిస్తోంది ప్రియాంక. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. గ్లోబల్ బ్యూటీ ఈ షెడ్యూల్ లో పాల్గొంది. మొదట హైదరాబాద్‌లో షూట్‌లో పాల్గొన్న ఈ అందాల తార ఆ తరువాత ఒడిశాలో జరిగిన షూట్‌కు కూడా హాజరైంది. ఇటీవల విశాఖపట్నం సమీపంలో జరిగిన షూటింగ్‌లోనూ ప్రియాంక పాల్గొంది. ఇదే క్రమంలో సినిమా చిత్రీకరణ ముగిసిన తర్వాత విమానాశ్రయానికి వెళ్తున్నప్పుడు జరిగిన ఒక ఆసక్తిర సంఘటను ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

ప్రియాంక చోప్రా ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయానికి కారులో వెళుతూ కనిపించింది. విశాఖ నుంచి ముంబైకి, అక్కడి నుంచి న్యూయార్క్ కు ప్రియాంక వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో విశాఖపట్నం విమానాశ్రయానికి కారులో వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన కొంతమంది మహిళలు జామ పళ్లు అమ్మడం చూసింది ప్రియాంక. వారిలో ఒకరి దగ్గర జామ పళ్లు కొనుగోలు చేసింది. ఆ పళ్ల ధర రూ. 150 రూపాయలు కాగా ప్రియాంక చోప్రా రూ. 200 నోటు ఇచ్చింది. చిల్లర డబ్బులు ఉంచుకోమని సదరు మహిళకు చెప్పింది. కానీ అందుకు ఆ మహిళ నిరాకరించింది. బదులుగా ప్రియాంకకు మరి కొన్ని పళ్లను ఇచ్చింది. ఇప్పుడిదే విషయాన్ని ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ‘ పళ్ల విక్రయమే ఆమెకు ఇదే జీవనాధారం అని నాకు తెలుసు. అందుకే రూ. 200 లు ఇచ్చి చిల్లర ఉంచుకోమన్ననాఉ. కానీ కొంతసేపటికి ఆమె అక్కడికి నుంచి వెళ్లి వెంటనే తిరిగి నా వద్దకు వచ్చి మరి కొన్ని పళ్లను ఇచ్చింది. నిజంగా ఆమె నే నిజమైన వర్కింగ్‌ ఉమెన్‌. వేరొకరి సాయాన్ని ఆమె కోరుకోలేదు. ఆమె ప్రవర్తన నా మనసును గెలిచింది’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.

ప్రియాంక చోప్రా పోస్ట్ ఇదిగో..

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

ప్రియాంక చోప్రా మహేష్ బాబు, రాజమౌళిలతో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు ‘హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్’, ‘ది బ్లఫ్’ అనే హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి