Tollywood : సినిమాలకు గుడ్ బై చెప్పి.. లక్షల్లో సంపాదిస్తున్న హీరోయిన్.. ఎలాఅంటే..
తెలుగులో పలు సినిమాల్లో నటించారు ప్రీతీ. విజయ్ కుమార్, నటి మంజులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో ఒకరు ప్రీతీ విజయ్ కుమార్. ఈ అమ్మడు రుక్మిణి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యింది. 1998లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళ్ , మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది.

చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే కనిపించకుండా పోయారు. హీరోయిన్ గా వరుసగా హిట్స్ అందుకుంటున్న నేపథ్యంలో సినిమాలకు దూరం అయ్యి అభిమానులకు షాక్ ఇచ్చారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు ఆ అమ్మడు. ఆమె పేరు ప్రీతీ విజయ్ కుమార్. తెలుగులో పలు సినిమాల్లో నటించారు ప్రీతీ. విజయ్ కుమార్, నటి మంజులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో ఒకరు ప్రీతీ విజయ్ కుమార్. ఈ అమ్మడు రుక్మిణి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యింది. 1998లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళ్ , మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహ సినిమాలో ఆయన కూతురిగా కనిపించింది.
పెళ్లి తర్వాత ప్రీతీ సినిమాలకు గుడ్ బై చెప్పింది. 2002లో దర్శకుడు హరిని పెళ్లి చేసుకుని పూర్తిగా ఫ్యామిలీకి అంకితం అయ్యింది ఈ చిన్నది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది ప్రీతీ. అయితే సినిమాలకు దూరమైనప్పటికీ ఇతర బిజినెస్ లలో బిజీగా మారింది ప్రీతీ.
చైన్నె సముద్రతీరంలో ఓ అందమైన కల్యాణమండపం ఉంది. ఉత్తండి అనే ప్రాంతంలో ప్రీత ప్యాలెస్ పేరుతో ఓ కళ్యాణమండపాన్ని ఏర్పాటు చేసింది ప్రీతీ. అలాగే దానికి సమీపంలో మెట్రో కాఫీ హౌస్ ఏర్పాటు చేశారు. అలాగే మద్రాసు కాఫీ పేరుతో పలు పలు ప్రాంచైజీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే వీటిలో పని చేసే వారందరూ మహిళలే అవ్వడం విశేషం. అంతే కాదు సాలిగ్రామంలోని సినీ ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోను నిర్వహిస్తున్నారు. ఇలా రకరకాల బిజినెస్లు చేసుకుంటూ లక్షల్లో సంపాదిస్తున్నారు ప్రీతీ విజయ్ కుమార్.
ప్రీతీ విజయ్ కుమార్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
ప్రీతీ విజయ్ కుమార్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
ప్రీతీ విజయ్ కుమార్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి