AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jani Master: ‘ఇకపై జానీ మాస్టర్‌ను అలా పిలవకండి’.. నటి పూనమ్ కౌర్ సంచలన పోస్ట్

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ పై ఓ లేడీ డ్యాన్సర్ లైంగిక ఆరోపణలు చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో ఔట్‌డోర్‌ షూటింగ్‌లకి వెళ్లినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది

Jani Master: 'ఇకపై జానీ మాస్టర్‌ను అలా పిలవకండి'.. నటి పూనమ్ కౌర్ సంచలన పోస్ట్
Poonam Kaur, Jani Master
Basha Shek
|

Updated on: Sep 17, 2024 | 2:10 PM

Share

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ పై ఓ లేడీ డ్యాన్సర్ లైంగిక ఆరోపణలు చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో ఔట్‌డోర్‌ షూటింగ్‌లకి వెళ్లినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే పలు సార్లు క్యార్ వాన్ లో నూ బలవంతం చేశాడని, బయటకు చెబితే అవకాశాలు లేకుండా చేస్తానని హెచ్చరించాడంటూ సదరు లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదును పరిగణణలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.దక్షిణాదిలో స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్ ఇప్పుడిలా లైంగిక ఆరోపణల్లో చిక్కు కోవడం తెలుగు నాట సంచలనంగా మారింది. ఈ వివాదంపై స్పందించిన జనసేన.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని జానీ మాస్టర్ ను ఆదేశించింది. ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖలు కూడా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ జానీ మాస్టర్‌పై విషయంపై స్పందించింది. ఇకపై అతనిని ఎవరూ మాస్టర్ అని పిలవొద్దని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేసింది. ‘నిందితుడు షేక్ జానీ ని ఇకపై ఎవరు జానీ మాస్టర్ అని పిలవకండి. మాస్టర్ అనే పదానికి కాస్త గౌరవం, విలువ ఇవ్వండి’ అని ట్విట్టర లో రాసుకొచ్చింది పూనమ్ కౌర్.

అంతకు ముందు ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా జానీ మాస్టర్ పై వస్తోన్న ఆరోపణలపై స్పందించింది. పలు మీడియా కథానాలను ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేసిన ఆమె .. “నివేదికల ప్రకారం ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ వేధించడం ప్రారంభించాడు. ఈ కేసులో పోరాడేందుకు కావాల్సినంత శక్తి ఆ అమ్మాయికి చేకూరాలని నేను కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చింది సింగర్ చిన్మయి. మొత్తానికి జానీ మాస్టర్ పై వస్తోన్న లైంగిక ఆరోపణలు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

పూనమ్ కౌర్ ట్వీట్..

సింగర్ చిన్మయి పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి