AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithya Menen: అందుకే నేనే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన నిత్యామీనన్

టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం స్కైలాబ్‌. ఈ సినిమాలో నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Nithya Menen: అందుకే నేనే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన నిత్యామీనన్
Nithya Menen
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2021 | 5:34 PM

Share

Nithya Menen: టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటిస్తున్న తాజా చిత్రం స్కైలాబ్‌. ఈ సినిమాలో నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ప్రస్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా గురించి హీరోయిన్ నిత్యామీనన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. స్కైలాబ్‌ గురించి ఎవరిని అడిగినా చాలా కథలు చెబుతున్నారు. ఈ జనరేషన్‌ వాళ్లకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. అందుకే ఆ జనరేషన్‌కీ, ఈ జనరేషన్‌కీ కూడా కనెక్ట్ అవుతుంది. నిర్మాతగా హ్యాపీగా ఉన్నా అన్నారు నిత్యామీనన్‌.

ఇలాంటి స్క్రిప్ట్ వింటే ఎవరూ ఎగ్జయిట్‌ కాకుండా ఉండరు. అంత పొటెన్షియల్‌ ఉన్న స్క్రిప్ట్. స్కైలాబ్‌ ట్రీట్‌మెంట్‌ చాలా బాగా అనిపించింది. తెలుగు సినిమాకు అది చాలా కొత్తగా అనిపించింది. తెలంగాణలోని చిన్న గ్రామంలో జరిగే కథే. కానీ, బ్యాక్‌గ్రౌండ్‌లో వెస్టర్న్ క్లాసికల్‌ మ్యూజిక్‌ ఉంటుంది. సినిమాలో అలాంటి పారడాక్సికల్‌ ట్రీట్‌మెంట్‌ నాకు చాలా ఇష్టం. అది వినగానే వెంటనే ఒప్పేసుకున్నా. మంచి సినిమా తీయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. అలాంటి తరుణంలో నేను కూడా ప్రొడ్యూస్‌ చేస్తానని చెప్పా అని అన్నారు నిత్యా. కథ విన్నప్పుడు మాత్రం కచ్చితంగా ఇలాంటి సినిమా స్క్రీన్‌ మీదకు రావాలని అనుకున్నా. కానీ, కొన్ని ఇష్యూల వల్ల నేను అనుకోకుండా నిర్మాతగా మారాను అన్నారు. నాకు స్కైల్యాబ్‌ గురించి తెలియదు. ఇంటికెళ్లి అమ్మానాన్నలను అడిగితే, దాని గురించి చాలా కథలు చెప్పారు. మరి ఇన్నాళ్లు ఎందుకు నాతో చెప్పలేదు అని అడిగా. అప్పుడనిపించింది నాకు.. మన జనరేషన్‌కి దీని గురించి ఏమీ తెలియదు. పాత జనరేషన్‌ వాళ్లకు తెలుసు. ఆ కనెక్ట్ ఉంటుంది. స్కైల్యాబ్‌ గురించి ఎవరిని అడిగినా వాళ్లకో కథ ఉంది. సో అందరూ కనెక్ట్ అవుతారనిపించింది అన్నారు నిత్యా మీనన్.  సత్య దేవ్,  రాహుల్‌తో నాకు కాంబినేషన్‌ సీన్స్ లేవు. ఈ సినిమా 3 కేరక్టర్ల గురించి. 3 లీడ్స్ ఉంటాయి. రాహుల్‌, సత్యకి… వాళ్లకి కాంబినేషన్‌ సీన్స్ ఉన్నాయి. నాది సెపరేట్‌ ట్రాక్‌. వాళ్లతో యాక్ట్ చేయలేదు. అందుకే ఇంటరాక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు సినిమా చూస్తుంటే, వాళ్లిద్దరూ చాలా ఫ్యాబులెస్‌గా పెర్పార్మ్ చేశారు అనిపించింది అన్నారు నిత్యా. ఇక ఈ సినిమాను డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akhanda Pre Release Event photos: అఖండ మొదటి గర్జనలో సందడి చేసిన పుష్పరాజ్ , బాలయ్య..(ఫొటోస్)

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Akhanda Pre Release Event Highlights: బోయపాటి బాలయ్య గర్జనలో భాగంగా.. అఖండ ప్రీ రిలీజ్ హైలైట్స్..(వీడియో)