Nayanthara: ఆ టీవీ సీరియల్ అంటే నయనతారకు విపరీతమైన ఇష్టమట.. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా..

హీరోయిన్స్ కు సంబందించిన విషయాలు ఎక్కువగా నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా నయనతార గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ గా మారింది. లేడీ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో రాణిస్తుంది నయనతార.

Nayanthara: ఆ టీవీ సీరియల్ అంటే నయనతారకు విపరీతమైన ఇష్టమట.. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా..
Nayanthara
Follow us

|

Updated on: Nov 06, 2024 | 8:16 AM

సెలబ్రటీలకు సంబందించిన ఫోటోలు, వీడియోలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ కు సంబందించిన విషయాలు ఎక్కువగా నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా నయనతార గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ గా మారింది. లేడీ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో రాణిస్తుంది నయనతార. అందాల భామ నయనతార తమిళం, తెలుగు, మలయాళం, హిందీలలో పాన్-ఇండియన్ స్టార్ గా రాణిస్తుంది. నయనతార 2003లో మలయాళ చిత్రం మనసినకరేతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ ఇది.! యమదొంగలో ఉన్న ఈ చిన్నది.. ఆ బిగ్ బాస్ హాట్ బ్యూటీనా..!

స్టార్ గా ఇండస్ట్రీలో రాణించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. హరి దర్శకత్వంలో 2005లో వచ్చిన అయ్యా చిత్రంలో నటించి తమిళ అభిమానుల దృష్టిని ఆకర్షించింది నయనతార. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన లక్ష్మీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది ఈ చిన్నది.

ఇది కూడా చదవండి : Ottesi Cheputunna: అమ్మబాబోయ్..! ఒట్టేసి చెపుతున్నా హీరోయిన్ షాకింగ్ లుక్..

ఆ తర్వాత నయన్ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు సినిమాలతో పాటు తమిళ్ నుంచి డబ్ అయిన సినిమాలతోనూ నయన్ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తెలుగులో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. ఇక తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్, అజిత్, విజయ్, సూర్య వంటి ప్రముఖ నటులకు నయనతార హీరోయిన్‌గా నటించింది. ఇదిలా ఉంటే నయన్ కు టీవీ సీరియల్స్ అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది. నయనతారకి సన్ టీవీ లో టెలికాస్ట్ అయ్యే సీరియల్ గయల్‌ని ఎక్కువ ఇష్టపడుతుందని తెలుస్తోంది. ఆ సీరియల్ ను ఒక్క ఎపిసోడ్‌ని కూడా మిస్ కాకుండా చూస్తుందని టాక్.

ఇది కూడా చదవండి :Shivaji : శివాజీ సినిమాలోని అక్కమ్మ జక్కమ్మలు గుర్తున్నారా.? ఈ ఇద్దరూ బయట ఏలా ఉంటారో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.