Pawan Kalyan: పవన్ కల్యాణ్ దమ్మున్న నాయకుడు.. డిప్యూటీ సీఎంపై టాలీవుడ్ హీరోయిన్ సంచలన ట్వీట్
జనసేన ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. తన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి మాట్లాడిన పవన్ ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపించాడు. ముఖ్యంగా డీలిమిటేషన్ విధానంపై తమిళనాడు డీఎంకే ప్రభుత్వానికి బాగా చురకలంటించాడు.

జన సేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు బాగా వైరలయ్యాయి. ఈ సందర్భంగా తన చిన్నప్పటి రోజులను మళ్లీ గుర్తు చేసుకున్నారాయన. అలాగే రాజకీయాల్లో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ సభలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే.. త్రిభాషా విధానంపై పవన్ చేసిన ప్రసంగం. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం హిందీ భాషను అడ్డుకుంటున్న తీరుపై పవన్ తీవ్రంగా మండి పడ్డారు. రూపీ సింబల్‌ను సైతం రద్దు చేసి కొత్తది ప్రవేశ పెట్టుకున్న స్టాలిన్ ప్రభుత్వ తీరుపై సటైర్లు వేశాడు. ‘హిందీ భాష మాత్రం వద్దు.. తమిళ సినిమాలు మాత్రం హిందీలో డబ్ చేస్తారు.. అక్కడి డబ్బులు మాత్రం మీకు కావాలి.. అక్కడి భాష మాత్రం మీకు వద్దా?’ అంటూ తమిళ నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డీలిమిటేషన్ విధానం గురించి పవన్ మాట్లాడిన తీరుపై భిన్నరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చాలామంది పవన్ తీరును మెచ్చుకుంటుంటే ప్రకాశ్ రాజ్ లాంటి మరికొందరు మాత్రం పవర్ స్టార్ కామెంట్స్ ను ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ‘పవన్ కళ్యాణ్ దమ్మున్న నాయకుడని ప్రశంసించింది. కేవలం గట్స్ మాత్రమే కాదు.. తెలివి, బుద్ది, జ్ఞానం ఉన్న నాయకుడు’ అంటూ తెగ పొగిడేసింది. ప్రస్తుతం మీరా చోప్రా ట్వీట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
కాగా పవన్ కల్యాణ్ తో కలిసి బంగారం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది మీరా చోప్రా. ఈ క్రమంలోనే అప్పటి నుంచి పవన్ కల్యాణ్ తో ఉన్న పరిచయాన్ని బట్టి ఇలా ట్వీట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇక మరో నటి కస్తూరి కూడా పవన్ కల్యాణ్ మీద ప్రశంసలు కురిపించింది. డీఎంకే ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డ ఆమె జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన కామెంట్స్ ను స్వాగతించింది.
మీరా చోప్రా ట్వీట్..
👏👏👏👏@PawanKalyan is a true leader with guts and wisdom both! https://t.co/wjv5cjyZig
— Meera Choppra (@MeerraChopra) March 15, 2025
మరో వైపు ప్రకాష్ రాజ్ మాత్రం పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. అలాగే పవన్ కల్యాణ్ కు సన్నిహితుడైన బండ్ల గణేష్ కూడా ప్రకాశ్ రాజ్ కు కౌంటర్లు వేస్తన్నారు.
భర్తతో మీరా చోప్రా..
View this post on Instagram