AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Lakshmi: మంచి మ‌న‌సు చాటుకున్న మంచు ల‌క్ష్మి… క‌రోనాతో మ‌ర‌ణించిన వారి చిన్నారుల‌కు అండ‌గా..

Manchu Lakshmi: క‌రోనా సెకండ్ వేవ్ భార‌త్‌లో ఎంతో మంది ప్రాణాలను హ‌రిస్తోంది. స‌మ‌యానికి చికిత్స అంద‌క కొంద‌రు, ఆక్సిజ‌న్ ల‌భించ‌క మ‌రి కొంద‌రు ప్రాణాల‌ను వ‌దులుతున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి....

Manchu Lakshmi: మంచి మ‌న‌సు చాటుకున్న మంచు ల‌క్ష్మి... క‌రోనాతో మ‌ర‌ణించిన వారి చిన్నారుల‌కు అండ‌గా..
Manchu Lakshmi Corona
Narender Vaitla
|

Updated on: May 22, 2021 | 12:07 PM

Share

Manchu Lakshmi: క‌రోనా సెకండ్ వేవ్ భార‌త్‌లో ఎంతో మంది ప్రాణాలను హ‌రిస్తోంది. స‌మ‌యానికి చికిత్స అంద‌క కొంద‌రు, ఆక్సిజ‌న్ ల‌భించ‌క మ‌రి కొంద‌రు ప్రాణాల‌ను వ‌దులుతున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి ఎంతో మంది చిన్నారుల‌ను ఆనాథ‌లుగా మారుస్తోంది. ఈ క్ర‌మంలోనే క‌రోనా సృష్టిస్తోన్న క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించేందుకు కొంద‌రు మ‌న‌సున్న మంచి మ‌న‌సులు ముందుకొస్తున్నారు. ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీలు విరాళాలు సేక‌రిస్తూ క‌రోనా బాధితుల‌ను ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా న‌టి మంచు ల‌క్ష్మి కూడా క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చారు. ఇందులో భాగంగా ‘టీచ్ ఫ‌ర్ చేంజ్’ అనే స్వ‌చ్చంద సంస్థ‌తో క‌లిసి 1000 మంది పిల్ల‌ల‌కు విద్య‌, వైద్యం ఇత‌ర ప్రాథ‌మిక అవ‌స‌రాల‌ను తీర్చేందుకు సహాయం అందించనున్నారు. ఆదాయం త‌క్కువ‌గా ఉన్న కుటుంబాల‌ను గుర్తించి వారిలో 1000 మందికి విద్య‌, ట్యూష‌న్, బ‌ట్ట‌ల‌తో పాటు ఇత‌ర స‌హాయం అదించ‌నున్నారు. ఈ విష‌య‌మై మంచు ల‌క్ష్మి మాట్లాడుతూ.. కరోనా వల్ల దురదృష్టవశాత్తూ కొందరు పిల్లలు వారి తల్లిదండ్రులను పొగొట్టుకున్నారు. అలాంటి వారిని గుర్తించి వారికి సహాయం చేస్తామ‌ని చెప్పుకొచ్చారు. ఇక లాక్‌డౌన్ స‌మ‌యంలో 1000 మందికి భోజనాలు పంపిణీ చేసేందుకు కొన్ని ఆసుపత్రులను ఎంచుకున్నామని చెప్పిన మంచు ల‌క్ష్మి.. వారి కోసం టీచ్ ఫర్‌ చేంజ్‌ బృందం, వాలంటీర్స్ తో పాటు బృంద సభ్యులు ప్రతిరోజూ వారికి ఆహారం ఇచ్చి ఆకలిని తీర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు ల‌క్ష్మి.

మంచు ల‌క్ష్మి చేసిన ట్వీట్‌..

Also Read: ముడుపుల కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సీబీఐ క్లీన్ చిట్, మరి ఇన్నేళ్ల విచారణ నీరుగారిపోయిందా ?

CM KCR condolences : తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని, గాయకుడ్ని కోల్పోయింది : ముఖ్యమంత్రి కేసీఆర్

కంటికి కనిపించే దేవుళ్ల పాలిట శనిలా కరోనా…రోజురోజుకూ పెరుగుతున్న డాక్టర్ల మరణాలు

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!