కంటికి కనిపించే దేవుళ్ల పాలిట శనిలా కరోనా…రోజురోజుకూ పెరుగుతున్న డాక్టర్ల మరణాలు

ప్రాణాపాయ స్థితిలోని ఎందరికో ప్రాణాలు నిలబెట్టే డాక్టర్లు...మనకు కనిపించే దేవుళ్లు. కరోనా మహమ్మారి అలాంటి డాక్టర్ల పాలిట కూడా శపంలా మారింది. కరోనా బారిన పడిన రోగులకు చికిత్స కల్పిస్తూనే తమ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు.

కంటికి కనిపించే దేవుళ్ల పాలిట శనిలా కరోనా...రోజురోజుకూ పెరుగుతున్న డాక్టర్ల మరణాలు
Representative Image
Follow us
Janardhan Veluru

| Edited By: Team Veegam

Updated on: May 22, 2021 | 10:21 PM

ప్రాణాలతో పోరాడుతున్న ఎందరో రోగుల ప్రాణాలు నిలబెట్టే డాక్టర్లు…మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్లు. కరోనా మహమ్మారి అలాంటి డాక్టర్ల పాలిట కూడా శపంలా మారింది. కరోనా బారిన పడిన రోగులకు చికిత్స కల్పిస్తూనే నిత్యం పదుల సంఖ్యలో వైద్యులు తమ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. అలా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారీ సంఖ్యలోనే డాక్టర్లు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఆ మేరకు డాక్టర్ల మరణాలకు సంబందించిన వివరాలు సేకరించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) సదరు షాకింగ్ వివరాలను మీడియాకు వెల్లడించింది. సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ బారినపడి ఏకంగా 420 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. కరోనా బారినపడి మృతి చెందుతున్న డాక్టర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం పట్ల ఐఎంఏ ఆందోళన వ్యక్తంచేసింది.

ఐఎంఏ వెల్లడించిన వివరాల మేరకు…కోవిడ్ ఫస్ట్ వేవ్‌లో దాదాపు 748 మంది డాక్టర్లు కరోనాతో మృతి చెందారు. అంటే ఇప్పటి వరకు దేశంలో 1100 మందికి పైగా డాక్టర్లు కరోనా కాటుకు బలయ్యారు. వైద్య రంగంలోని వర్కర్స్‌లో 66 శాతం మందికి ఇప్పటికే కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. డాక్టర్లలో దాదాపు 90 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. మిగిలిన వారికి కూడా త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. అయితే డాక్టర్లలో చాలా మంది ఇప్పటి వరకు ఒక వ్యాక్సిన్ మాత్రమే తీసుకున్నారు. రెండు వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు.

దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నా…మరణాల సంఖ్య మాత్రం ఎక్కువగానే నమోదవుతోంది. నిత్యం 4 వేల మందికి పైగా కరోనాతో మృతి చెందుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన డేటా మేరకు దేశంలో గత 24 గంటల వ్యవధిలో 2,57,299 కొత్త కరోనా కేసులు నమోదుకాగా…4,194 మంది కరోనా కాటుకు బలయ్యారు. కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల కంటే డిశ్చార్జిలు( 3,57,630) ఎక్కువగా ఉండటమే కాస్త ఊరట కలిగించే అంశం.

ఇది కూడా చదవండి… క‌రోనా మూడో వేవ్ చిన్నారుల‌ను వ‌ణికిస్తోన్న‌ వేళ‌.. భ‌య‌పెడుతోన్న క‌ర్ణాట‌క గ‌ణంకాలు..

రెండో డోసు ఎంత లేటైతే అంత మేలు.. అమెరికన్ సైంటిస్టుల తాజా అధ్యయనం ఫలితమిదే!

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..