AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముడుపుల కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సీబీఐ క్లీన్ చిట్, మరి ఇన్నేళ్ల విచారణ నీరుగారిపోయిందా ?

ముడుపుల కేసులో మాజీ రైల్వే శాఖ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఆయనకు కోర్టు గత ఏప్రిల్ లో బెయిల్ మంజూరు చేసింది.

ముడుపుల కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సీబీఐ క్లీన్ చిట్,  మరి ఇన్నేళ్ల విచారణ నీరుగారిపోయిందా ?
Lalu Prasad Yadav
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 22, 2021 | 11:52 AM

Share

ముడుపుల కేసులో మాజీ రైల్వే శాఖ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఆయనకు కోర్టు గత ఏప్రిల్ లో బెయిల్ మంజూరు చేసింది. రియల్ ఎస్టేట్ డెవెలపర్ డీఎల్ఎఫ్ గ్రూపు ప్రాజెక్టు వ్యవహారంలో లాలూ ప్రసాద్ ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐలోని ఆర్థిక నేరాల నివారణా విభాగం 2018 జనవరిలో ప్రిలిమినరీ విచారణ చేపట్టింది. ముంబైలోని బాంద్రా, ఢిల్లీలోని రైల్వే స్టేషన్ల అప్ గ్రేడేషన్ ప్రాజెక్టుల్లో ఈ గ్రూపు లాలూకు లంచం ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. సౌత్ ఢిల్లీలోని ప్రాపర్టీని ఆయనకు ‘కానుక’ గా అందజేసిందన్నది ఈ ఆరోపణల సారాంశం. 2007 డిసెంబరులో సౌత్ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఏ బీ ఎక్స్ పోర్ట్స్ అనే డొల్ల కంపెనీ దాదాపు 5 కోట్ల విలువైన ప్రాపర్టీని కొనుగోలు చేయగా.. డీఎల్ఎఫ్ డెవలపర్స్, మరికొన్ని షెల్ కంపెనీలు ఇందుకు దానికి సొమ్ము సమకూర్చాయని, ఈ వ్యవహారంలో లాలూకు ముడుపులు చెల్లించాయని నాడు వార్తలు వచ్చాయి. కాగా నిజానికి ఈ ప్రాపర్టీ అప్పట్లోనే రూ. 30 కోట్ల విలువ చేసిందని కూడా తెలియవచ్చింది. . 2011 లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్, అతని ఇద్దరు కూతుళ్లు షేర్ల బదిలీ ద్వారా ఏ బీ ఎక్స్ పోర్ట్స్ కంపెనీని కేవలం 4 లక్షలకు కొన్నారని, దీంతో సౌత్ ఢిల్లీలోని ప్రాపర్టీని కూడా చేజిక్కించుకున్నారని తెలిసింది.

అటు బీహార్ పశుగ్రాసం కేసుకు సంబంధించి గత నెలలో ఝార్ఖండ్ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ మంజూరు చేసింది. ఆయన అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇస్తునట్టు కోర్టు పేర్కొంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: చపాతీలు ఇలా కూడా చేస్తారా..?? ఈ స్టైల్ చూసి ఫిదా ఆయన నెటిజన్లు.. ( వీడియో )

Viral Video: పోలీసుల నుంచి తప్పించుకుని డ్రైనేజీలో దూకిన దొంగ.. వైరల్‏గా మారిన వీడియో..

Viral Video: ఆఫీసులో బుస బసలు.. అధికారులకు చుక్కల చూపించిన కొండచిలువ..!! ( వీడియో )