రాజు తలచుకుంటే ! బెంగాల్ లో బీజేపీ నేత శిశిర్ అధికారికి వై ప్లస్ సెక్యూరిటీ, ఇప్పటికే అధికారి కుటుంబంలో ముగ్గురికి…

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నేత సువెందు అధికారి తండ్రి, ఎంపీ కూడా అయిన శిశిర్ అధికారికి కేంద్రం వై ప్లస్ భద్రతను కల్పించింది.

రాజు తలచుకుంటే ! బెంగాల్ లో బీజేపీ నేత శిశిర్ అధికారికి వై ప్లస్ సెక్యూరిటీ, ఇప్పటికే అధికారి కుటుంబంలో ముగ్గురికి…
Y Plus Security To Bjp Leader Sisir Adhikari

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నేత సువెందు అధికారి తండ్రి, ఎంపీ కూడా అయిన శిశిర్ అధికారికి కేంద్రం వై ప్లస్ భద్రతను కల్పించింది. రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ తో సుదీర్ఘ అనుబంధం కొనసాగించి అసెంబ్లీ ఎన్నికల ముందు ఈయన ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈయనతో బాటు దివ్యెందు అధికారికి కూడా హోమ్ శాఖ వై ప్లస్ సెక్యూరిటీని కల్పించడం విశేషం. దీంతో అధికారి కుటుంబంలో ముగ్గురికి ఇక సిఆర్పీఎఫ్ భద్రత ఉంటుంది. ఒకప్పుడు రాష్ట్ర సీఎం మమతా ముఖర్జీకి అతి సన్నిహితుడుగా ఉండి..ఆ తరువాత ఆమెతో విభేదించిన సువెందు అధికారి ఇటీవలి ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో ఈమె మీద స్వల్ప మెజారిటీతో గెలిచారు. నూతన బెంగాల్ అసెంబ్లీలో ఆయన బీజేపీ ప్రతిపక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనను బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. బెంగాల్ ఎన్నికల్లో 77 సీట్లను గెలుచుకుని బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. ముకుల్ రాయ్ వంటి సీనియర్ నేతలున్నప్పటికీ సువెందు అధికారిని విపక్ష నాయకునిగా ఎన్నుకున్నారు. నాడియా నియోజకవర్గం నుంచి ముకుల్ రాయ్ విజయం సాధించారు.

కాగా తనకు వై ప్లస్ భద్రత కల్పించినందుకు శిశిర్ రాయ్ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పార్టీ మరింత ప్రాచుర్యం పొందేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఇప్పటికే పాలక తృణమూల్ కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో శిశిర్ అధికారి వంటి సీనియర్ నేతల అవసరం ఎంతయినా ఉందని పార్టీ భావిస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Jio: తెలుగు రాష్ట్రాల్లోని జియో యూజర్లకు శుభవార్త.. ఇక డబుల్ స్పీడ్‌తో డేటా .. ( వీడియో )

Viral Video: ఆఫీసులో బుస బసలు.. అధికారులకు చుక్కల చూపించిన కొండచిలువ..!! ( వీడియో )

Click on your DTH Provider to Add TV9 Telugu