Mamta Mohandas: మమతా మోహన్‌దాస్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు.. ఫైర్ అయిన హీరోయిన్..
ఇటీవల నాలుగైదు రోజుల కిందట నేషనల్ క్రష్ రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎంతగా వైరలయ్యిందో చూశాం. ఈ వీడియోపై టాలీవుడ్ , బాలీవుడ్ సెలబ్రెటీలతోపాటు.. రాజకీయ నాయకులు స్పందించారు. మార్ఫింగ్ వీడియో చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ఇప్పుడు కోలీవుడ్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ ఆరోగ్యం గురించి రాసిన ఓ తప్పుడు కథనం నెట్టింట వైరలయ్యింది. ఇది చూసిన హీరోయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన గురించి అబద్ధపు వార్తలను సృష్టించినందుకు అసహనం వ్యక్తం చేస్తూ..
ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హీరోహీరోయిన్లకు సంబంధించిన అసత్య వార్తలు నిత్యం నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల గురించి రోజురోజుకూ ఎన్నో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇటువంటి రూమర్స్ సదరు నటీనటులు ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా వారికి చాలా మానసిక క్షోభను కలిగిస్తుంది. అయితే చాలా మంది సినీతారలు తమ గురించి వచ్చే రూమర్స్ ను పట్టించుకోరు. కానీ కొన్ని సందర్భాల్లో వారి వ్యక్తిగత జీవితం గురించి హద్దుమీరిన రూమర్స్ పై మాత్రమే స్పందిస్తుంటారు. ఇటీవల నాలుగైదు రోజుల కిందట నేషనల్ క్రష్ రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎంతగా వైరలయ్యిందో చూశాం. ఈ వీడియోపై టాలీవుడ్ , బాలీవుడ్ సెలబ్రెటీలతోపాటు.. రాజకీయ నాయకులు స్పందించారు. మార్ఫింగ్ వీడియో చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక ఇప్పుడు కోలీవుడ్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ ఆరోగ్యం గురించి రాసిన ఓ తప్పుడు కథనం నెట్టింట వైరలయ్యింది. ఇది చూసిన హీరోయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన గురించి అబద్ధపు వార్తలను సృష్టించినందుకు అసహనం వ్యక్తం చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఇలాంటి పని చేస్తుంటారని తెలిపింది.
గీతూ నాయర్ అనే ఫేక్ ప్రొఫైల్లో.. మమతా మోహన్ దాస్ ఆరోగ్యం గురించి ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ అయ్యింది. “నేను మరణానికి లొంగిపోతున్నాను. ఇక బతకలేను. మమతా మోహన్‌దాస్ జీవితం దుర్భర స్థితిలో ఉంది” అంటూ టైటిల్ తో వార్త సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఇందులో ఆమెను కించపరిచే విధంగా పేర్కొంది. దీనిపై మమతా ఘాటుగానే స్పందించింది.
View this post on Instagram
“అసలు నీవెవరు? గీతూ నాయర్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీ పేజీపై ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి మీరు ఏదైనా చెబుతారని అనుకుంటాను. దయచేసి ఇలాంటి మోసాన్ని అనుసరించవద్దు. ఇలాంటివారు ఇతరులను తప్పుదారి పట్టించగలరు” అని పేర్కొన్నారు. అయితే మమతా మోహన్ దాస్ కామెంట్ చేసిన తర్వాత సదరు గీతూ నాయర్ పేజీ డియాక్టివేట్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మమతా మలయాళంలో దిలీప్‌తో ‘బాంద్రా’, తమిళంలో విజయ్ సేతుపతితో ‘మహారాజా’ సినిమాలు చేస్తోంది. మమతా మోహన్ దాస్ తెలుగులో చింతకాయల రవి, యమదొంగ, కృష్ణార్జున, హోమం చిత్రాల్లో నటించింది. ఇటీవల జగపతి బాబు నటించిన రుద్రంగి సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.