సౌత్ అడియన్స్‌కు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు మమతా మోహన్ దాస్. యమదొంగ సినిమాలో ఓలబ్బయ్యో అంటూ ఎన్టీఆర్‌తో కలిసి యాక్టింగ్ అదరగొట్టేసింది. అంతకు ముందు కృష్ణార్జున, హోమం చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. మలయాళీ చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. మయూఖం సినిమాతో పాపులారిటీని సొంతం చేసుకున్న మమతా మోహన్ దాస్ నటిగానే కాదు సింగర్ కూడా. అయితే నటిగా చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న సమయంలోనే ఆమెను క్యాన్సర్ కబలించింది. ఆ మహమ్మారిని ఎదుర్కొని ఇప్పుడు మరోసారి వెండితెరపై సందడి చేస్తుంది. ఈరోజు మమతా మోహన్ 40వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
నవంబర్ 14, 1984న బహ్రెయిన్‌లో కన్నూర్‌కు చెందిన అంబాలపట్ మోహన్‌దాస్, గంగా దంపతులకు జన్మించింది మమతా మోహన్ దాస్. మమత బాల్యం అంతా బహ్రెయిన్‌లోనే సాగింది. అక్కడే ఇండియన్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేసి.. ఆ తర్వాత బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత IBM, కళ్యాణ్ కేంద్రం వంటి సంస్థల ప్రకటనలకు మోడల్‌గా వర్క్ చేసింది. అదే సమయంలో మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. మమతా ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక ఆస్తులు కలిగిన నటీమణులలో ఒకరు. ఆమె దగ్గర కేరళలోనే అరుదైన పోర్షే 911 కారెరా ఎస్ స్పోర్ట్స్ కారు ఉంది.
దీంతో పాటు మమతకు కొచ్చి, దుబాయ్‌లలో ఫ్లాట్లు ఉన్నాయని, కోట్ల ఆస్తులు ఉన్నాయని కూడా సమాచారం. తల్లిదండ్రులు ఇద్దరూ ఎన్నో ఆస్తులు సంపాదించినప్పటికీ.. తన సొంతంగా ఆస్తిని కూడబెట్టుకుంది మమతా. క్యాన్సర్ కారణంగా కొన్నాళ్లపాటు నటనకు దూరమైన మమతా.. ఇప్పుడు మమళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే జగపతి బాబు నటించిన రుద్రంగి సినిమాలో కనిపించింది. ఇందులో అద్భుతమైన నటనతో నటిగా ప్రశంసలు అందుకుంది.
ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‌ను చూశారా..?
Tollywood: ఆ ఒక్క డైలాగ్‌తో నెట్టింట తెగ ఫేమస్.. ఈ యంగ్ హీరో సతీమణి ఎవరో గుర్తుపట్టారా.?
Pawan Kalyan: ఏంటీ బాస్.. మరీ అంత తక్కువా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తెలిస్తే..
Samantha: సామ్ ఈజ్ బ్యాక్.. సిటాడెల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.