Kiara Advani: కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ.. ఆ స్టార్ హీరో సినిమాలో కియారాకు ఛాన్స్ ?..
అందం, అభినయంతో టాలీవుడ్ ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ పట్టేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani). ఈ సినిమాలో కియారా తన అందం, అభినయంతో టాలీవుడ్ ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ పట్టేసింది. పక్కా మాస్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. గత కోద్ది రోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా ఉన్న కియారా ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్.. డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇప్పటివరకు టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలోనే అవకాశాలు అందుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు కోలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. టాలెంటెడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోుతన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ కోసం కియారా అద్వానీని సంప్రదించారట డైరెక్టర్. స్టోరీ విన్న కియారా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సుముఖత చూపించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారక ప్రకటన రానుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.