AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 200కు పైగా సినిమాలు.. చిరంజీవి, బాలయ్యలతో ఒక్క మూవీ కూడా చేయలేదు.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరంటే?

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమాల్లో హీరోయిన్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అలాంటిది తన కెరీర్ లో 200 కు పైగా సినిమాలు చేసిన ఈ స్టార్ హీరోయిన్ ఈ ఇద్దరి హీరోలతో కనీసం ఒక్క సినిమా కూడా చేయలేదు.

Tollywood: 200కు పైగా సినిమాలు.. చిరంజీవి, బాలయ్యలతో ఒక్క మూవీ కూడా చేయలేదు.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరంటే?
Chiranjeevi, Balakrishna
Basha Shek
|

Updated on: Jun 19, 2026 | 6:36 PM

Share

చిరంజీవి, బాలకృష్ణ, వెంకేటష్, నాగార్జున.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ హీరోలను మూల స్తంభాలుగా పరిగణిస్తారు. ఈ హీరోల సినిమాల్లో ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇక హీరోయిన్ ఛాన్స్ వస్తే అసలు వదులుకోరు. అలా ఈ హీరోలు ఎంతో మంది హీరోయిన్లతో కలిసి స్క్రీన్ చేసుకున్నారు. సౌందర్య, రమ్యకృష్ణ, మీన, రంభ, రాశి.. ఇలా ఎంతో మంది అందాల తారలతో రొమాన్స్ చేశారు. అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో నటించిన ఓ స్టార్ హీరోయిన్ చిరంజీవి, బాలకృష్ణతో మాత్రం నటించలేకపోయింది. వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె చిరు, బాలయ్యలతో మాత్రం యాక్ట్ చేయలేకపోయింది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో సుమారు 200 కు పైగా సినిమాల్లో నటించారు ఖుష్బూ. హీరోయిన్ గానే కాకుండా సహాయక నటిగానూ మెప్పించారు. చిరంజీవితో హీరోయిన్ గా చేయలేదు కానీ స్టాలిన్ సినిమాలో ఆయనకు సోదరి పాత్రలో కనిపించారు ఖుష్బూ. అలాగే ఓ రియల్ ఎస్టేట్ యాడ్ లో చిరంజీవి భార్యగా కనిపించారు. అయితే బాలకృష్ణతో మాత్రం ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. దీనికి గల కారణాలను ఆమెనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘నేను తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీలోకి ఇచ్చాను. విక్టరీ వెంకటేష్ గారి మనవూరి పాండవులు సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాను. కానీ చిరంజీవి, బాలకృష్ణతో సినిమాలు చేయలేకపోయాను. ఇందుకు ప్రత్యేక కారణమేమీ లేదు. ఇక్కడ సినిమాలు చేస్తున్నసమయంలోనే నాకు తమిళంలో బాగా సినిమా ఆఫర్లు వచ్చాయి. దీంతో చెన్నైలోనే ఉండిపోయాను. బాలకృష్ణతో సినిమా చేయడానికి అవకాశం వచ్చింది. కానీ అప్పటికే తమిళంలో ఫుల్ బిజీగా ఉండటంతో ఆయన తో మూవీ చేయలేకపోయాను. అంతే కానీ.. చిరు, బాలయ్యలతో సినిమాలు చేయకపోవడానికి వేరే కారణం ఏమీ లేదు’ అని ఖుష్బూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కూతురితో ఖుష్బూ సుందర్..

కాగా ఖుష్బూ- సుందర్ ల సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ వీరి కూతురు కూడా సినిమా ఇండస్ట్రీలోకి రానుంది. పెద్ద కూతురు అవంతిక సుందర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us