AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: అందాల కీర్తిసురేష్ యోగా వీడియో.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతోందిగా

తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన నేను మహానటి సినిమాతో సంచనలన విజయాన్ని అందుకుంది కీర్తిసురేష్.

Keerthy Suresh: అందాల కీర్తిసురేష్ యోగా వీడియో.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతోందిగా
Keerthy Suresh
Rajeev Rayala
|

Updated on: Feb 12, 2023 | 11:37 AM

Share

యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముద్దుగుమ్మ కీర్తిసురేష్. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన నేను మహానటి సినిమాతో సంచనలన విజయాన్ని అందుకుంది కీర్తిసురేష్. మహానటి సావిత్రి జీవితకథతో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అచ్చం సావిత్రిగారిలా అద్భుతంగా నటించి మెప్పించింది ఈ అమ్మడు. ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయిపోయింది. ఆ తర్వాత తెలుగులో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకొని దూసుకుపోతోంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే తెలుగుతో పాటు, తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ..నిత్యం సినిమా అప్డేట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు కూడా పంచుకుంటుంది.

తాజాగా ఈ అమ్మడు యోగా చేస్తోన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై మీరూ ఒక లుక్కేయండి. కీర్తిసురేష్ ఫిట్నెస్ కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. సినిమాల్లో పాత్రకు తగ్గట్టుగా తనుతాను మార్చుకుంటూ ఉంటుంది కీర్తి. ఇక ప్రస్తుతం దసరా అనే సినిమాలో నటిస్తోంది కీర్తి. ఈ సినిమాలో నాని హీరో..