Adhurs: రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ అదుర్స్.. విడుదలయ్యేది అప్పుడే
ముఖ్యంగా బ్రహ్మానందం, ఎన్టీఆర్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. నయనతార, షీలా ఈ సినిమాలో తారక్ కు జోడీగా నటించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో మైల్ స్టోన్ గా నిలిచిన సినిమాల్లో అదుర్స్ ఒకటి వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. సినిమా మొత్తంలో తారక్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బ్రహ్మానందం, ఎన్టీఆర్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. నయనతార, షీలా ఈ సినిమాలో తారక్ కు జోడీగా నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రీ రిలీజ్ ల హవా నడుస్తున్న క్రమంలో అదుర్స్ సినిమా కూడా రీరిలీజ్ అవ్వనుంది. వచ్చే నెల మార్చిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
అదుర్స్ సినిమాను మార్చ్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బ్రహ్మానందం అదిరిపోయే కామెడీ పాత్రలో నటించి మెప్పించారు. తన మార్క్ కామెడీ తో అదరగొట్టేశారు. 2010లో విడుదలైన అదుర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మంచి కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ వి వి వినాయక్ లకు మంచి గుర్తింపు లభించింది. దీనికి వల్లభనేని వంశీ మోహన్ నిర్మాతగా వ్యవహరించారు.ఇక ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ కు రెడీ అయ్యింది. మరి ఈ సినిమా కలెక్షన్స్ ఎరేంజ్ లో రాబడుతుందో చూడాలి.



