AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karate Kalyani : ఆ ఆశతోనే రెండు సార్లు వివాహం చేసుకున్నా.. కరాటే కళ్యాణి ఆసక్తికర కామెంట్స్

కరాటే కళ్యాణి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు . ఆ తర్వాత నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తో కరాటే కల్యాణికి మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

Karate Kalyani : ఆ ఆశతోనే రెండు సార్లు వివాహం చేసుకున్నా.. కరాటే కళ్యాణి ఆసక్తికర కామెంట్స్
Kalyani
Rajeev Rayala
|

Updated on: Feb 08, 2022 | 6:19 PM

Share

Karate Kalyani : కరాటే కళ్యాణి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు . ఆ తర్వాత నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్(Bigg Boss)తో కరాటే కల్యాణికి మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా.. లేదా డైరెక్టర్ గా సమాజంలో జరిగే పలు విషయాలపై కూడా స్పందిస్తూ ఉంటారు.  ముక్కుసూటిగా మాట్లాడే కల్యాణి వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు కళ్యాణి. తాజాగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు, తన వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను గుర్తు చేసుకుని భావోద్వేగంకు గురయ్యారు.

‘భార్య అంటే వంటింటికే పరిమితం. ఏం చెప్తే అది చేయాలి ఎదురు మాట్లాడకూడదు అనుకునేవాళ్లు చాలామందే నేను అలా కాదు. ఫైర్ లాంటి దాన్ని అరచేతితో ఆపేయలేరు నిప్పుని ఎంతసేపు అని పట్టుకుంటారు. అందుకే వదిలేశారు నేను కరెక్ట్‌గానే ఉన్నాను అనుకున్నా.. కానీ అది వారికి తప్పు అనిపించిందేమో అన్నారు. మనస్పర్థలతో గొడవలు, అనుమానాలు. నాకు అది నచ్చలేదు. అందుకే విడాకులు తీసుకున్నా.. అని తెలిపారు కళ్యాణి. నాకు నచ్చినట్టు నేను హ్యాపీగా జీవిస్తున్నా..ప్రేమ, పెళ్లిళ్లు తనకు కలిసిరావు .. తనకు నిజమైన ప్రేమ దొరకలేదని కల్యాణి అన్నారు.

ప్రేమ, పెళ్లి పేరుతో నన్ను వాడుకున్నారు. నిజమైన ప్రేమ కోసం చూస్తున్నాను. అలాంటి ప్రేమ దొరికితే భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటా.. సరైనా అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానంటే పెళ్లికి లేదా సహజీవనానికి కూడా రెడీ. ఎందుకంటే నాకు పిల్లలు అంటే ఇష్టం. ఆ ఆశతోనే రెండు సార్లు వివాహం చేసుకున్నా.. కానీ ఆ ఆశ ఇప్పటికి తీరలేదు తన మాజీ భర్తల వల్ల చాలా కష్టాలు పడ్డాను.. తరచూ తాగోచ్చి కొట్టడం చేస్తుంటే భరించలేకపోయాను..నాపై అనుమానం. నేను చేయని తప్పుకి పడమంటే ఎలా పడతాను.. అంటూ చెప్పుకొచ్చారు కరాటే కళ్యాణి .

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shah Rukh Khan: షారుక్ ఖాన్ నిజంగా ఆపని చేశాడా..? ఆగ్రహం వ్యక్తం చేసిన నటి ఊర్మిళ

Rajinikanth: సూపర్ స్టార్ 170 కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు స్టార్ దర్శకులు..

Ghani Song Launch : వరుణ్ తేజ్ గని సినిమా నుంచి అందమైన మెలోడీ.. ఘనంగా సాంగ్ లాంచ్ ఈవెంట్